నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును పొందాడు. బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 


హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నాడు. అక్కడ తాను చేసే సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం బాలయ్య బాబుకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఓవైపు రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషిస్తూనే మరోవైపు సినిమాలలోను నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో అఖండ-2 సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

బాలయ్య బాబు వీరసింహారెడ్డి,  భగవంత్ కేసరి లాంటి సినిమాల సమయంలో కేవలం 15 నుంచి 18 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ వసూలు చేసేవారట. ఇక అఖండ-2 సినిమాలో నటించడానికి రూ. 36 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక అఖండ-2 సినిమా అనంతరం బాలయ్య బాబు దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఓ సినిమాను చేయబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలయ్య బాబు ఏకంగా 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా సినీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.


సినిమా కోసం ఏకంగా బాలయ్య బాబు 10 కోట్ల రెమ్యూనరేషన్ పెంచేశారు. ఈ హీరోతో సినిమా అంటే అంత సులభం కాదు. వయసు పెరిగినప్పటికీ ఈ హీరోకి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. యూత్ లో బాలయ్య బాబుకి విపరీతంగా అభిమానులు ఉన్నారు. అందుకే బాలయ్య బాబు సినిమాలో నటించడానికి భారీగా రెమ్యూనరేషన్ పెంచేశాడు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: