మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లావణ్య త్రిపాఠి అనేక సినిమాలో హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. తన కెరీర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా సమాచారం. 


చాలా సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించిన ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహం తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు పూర్తిగా దూరమైంది. వీరి వివాహం జరిగే దాదాపు సంవత్సరంకి పైనే అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కలిసి ఓ గుడ్ న్యూస్ ను వారి అభిమానులతో షేర్ చేసుకున్నారు. త్వరలోనే వారు తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా రివీల్ చేశారు. ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ తల్లిదండ్రులు అవుతున్నామని అఫీషియల్ గా గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు.

ఈ విషయం తెలిసి మెగా కుటుంబ సభ్యులు చాలా సంతోషంలో ఉన్నారట. ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన మాత్రం లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అవడంతో కాస్త కుళ్ళుకుంటుందని ఓ వార్త సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇంత తక్కువ సమయంలో ప్రెగ్నెంట్ అవడం ఏంటి మాకు కనీసం 12 సంవత్సరాలు పట్టింది. వీరు కేవలం ఒక సంవత్సరంలో మాత్రమే తల్లిదండ్రులుగా మారుతున్నారని ఉపాసన అన్నట్టుగా ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వార్తను కొంతమంది కావాలని సృష్టించినట్లుగా తెలుస్తోంది.

ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఉపాసన మీద సోషల్ మీడియాలో నెగిటివ్ గా ప్రచారం కొనసాగుతోంది. దీనిపైన ఉపాసన ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి తన ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎలాంటి పనులు చేయకుండా రెస్ట్ మూడ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. లావణ్య, వరుణ్ తేజ్ తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిసి వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: