సినీ సెలబ్రిటీలకు విడాకులు అంటే చాలా కామన్ అయిపోయింది. చాలా సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహాలు చేసుకున్నప్పటికీ ఎక్కువ కాలం కలిసి ఉండడం లేదు. చిన్న చిన్న గొడవలు, విభేదాల కారణంగా విడాకుల వరకు వెళ్తున్నారు. పిల్లలు ఉన్నప్పటికీ అడ్జస్ట్ అవ్వకుండా వారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో చాలామంది జంటలు ఇలానే చేస్తున్నారు. సోషల్ మీడియాలో వారికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడం, ఆ తర్వాత విడాకుల విషయాన్ని అనౌన్స్ ఇలా చేయడం ఫ్యాషన్ అయిపోయింది. 


ఈ కోవలోకి మరో జంట చేరారు. కోలీవుడ్ ప్రముఖ హీరో జయం రవి, ఆర్తి ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2009లో జరిగింది. రవి, ఆర్తికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయినప్పటికీ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి వీరి విడాకుల వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయాన్ని జయం రవి స్వయంగా వెల్లడించాడు. రవి, ఆర్తి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్తి తన భర్త జయం రవిపై సంచలన ఆరోపణలు చేసింది.

రవి తనను మానసికంగా వేధిస్తున్నాడని అంటుంది. ఆర్థికంగా తనను చాలా ఇబ్బందులకు గురి చేశాడని ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. ఎంతో ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఇంటి నుంచి బయటకు పంపించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడని ఆర్తి అన్నారు. ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు బ్యాంక్ అధికారుల నుంచి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని ఆర్తి వాపోతున్నారు.


నా పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. వారి కోసమే నేను ఇలా స్పందించాల్సి వచ్చిందని ఆర్తి ఇన్ స్టా వేదికగా పోస్ట్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్తి షేర్ చేసుకున్న ఈ విషయాలు సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజన్లు ఆర్తికి మద్దతు తెలుపుతున్నారు. తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని జయం రవిని కోరుతున్నారు. ఈ విషయంపైన జయం రవి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: