ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

అయితే ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను వినోదాన్ని పంచేందుకు సూపర్ మూవీస్ తో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేదాం. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ది డిప్లోమ్యాట్, ది మ్యాచ్, లాస్ట్ బుల్లెట్, నోన్నాస్, బ్యాడ్ ఇన్ ఫ్యూయెన్స్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే ది రాయల్స్, ఫరెవర్, బ్లడ్ ఆఫ్ జెసు అనే వెబ్ సిరీస్ లు ఆడుగుతున్నాయి. ఎ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓదెల 2, టెన్ అవర్స్, ఊసేపింటే ఒసియతు, వామన, నడికలిల్ సుందరి యమున, ది అస్సెస్‌మెంట్‌, కాన్ క్లేవ్, గ్రామ్ చికిత్సలే, ప్యార్ పైసా ప్రాఫిట్, ది వాకింగ్ డెడ్: డెడ్ సిటీ, ది మాన్ స్టర్ విత్ ఇన్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అపరాధి, అస్త్రం, సన్ నెక్స్ట్, కాలమేగ కరిగింది మూవీస్ ఆహా ఓటీటీలో ఆడుతున్నాయి. జియో హాట్ స్టార్ లో కూడా మూడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. పోకర్ ఫేస్ సీజన్ 2, యెల్లో స్టోన్ సీజన్ 5, ఫ్లింటాఫ్‌ మూవీస్ హాట్ స్టార్ లో చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: