ఈ విషయం చాలామందికి తెలిసిందే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గా పిలిపించుకునే తారక్ ఒరిజినల్ నేమ్ జూనియర్ ఎన్టీఆర్ కాదు . ఆయన ఒరిజినల్ పేరు వేరే ఉంది . కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్వయాన హరికృష్ణ ని పిలిచి ఈ అబ్బాయి ఫ్యూచర్లో నన్ను మించిన స్టార్ అవుతాడు అని .. ఈ అబ్బాయి కి టాలెంట్ ఎక్కువ ఉంది అని .. ఈ అబ్బాయి పేరు ఇకపై నుంచి నా పేరు గానే పిలవబడాలి అని తారక రామారావు అంటూ స్వయాన జూనియర్ ఎన్టీఆర్ కి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టారు.  ఈ విషయాన్ని హరికృష్ణఈవెంట్ లో బయటపెట్టారు .


అప్పటినుంచి సోషల్ మీడియాలో అరాకొరా జూనియర్ ఎన్టీఆర్ పేరు పై కౌంటర్స్ పడుతూనే వస్తున్నాయి.  కానీ ఈసారి ఏకంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ పేరు పై కౌంటర్ వేయడం తారక్ ఫ్యాన్స్ కు హర్టీంగ్గా అనిపిస్తుంది . మనకు తెలిసిందే నందమూరి కుటుంబంలో నుంచి 4వ జనరేషన్ హీరో గా  హరికృష్ణ మనవడు జానకిరామ్ కొడుకు తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.  వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.



ఈ సినిమాలో తెలుగు అమ్మాయి వీణారావు హీరోయిన్ గా నటిస్తుంది . తారకరామారావు నటిస్తున్న సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు రీసెంట్గా ఘనంగా జరిగాయి . ఈ ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీ వాళ్ళు అందరూ హాజరై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇదే మూమెంట్లో నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ "జానకిరామ్ కుమారుడు తారక రామారావు అమెరికాలో పుట్టారు అని ..అప్పుడే అతనికి తారక రామారావు అని పేరు పెట్టారు అని ..పుట్టుకతో అతనికి తారక రామారావు పేరు వచ్చింది సగంలో ఎవరూ కూడా ఇలా ఆయనకు పేరు పెట్టింది కాదు " అంటూ ఆయన తన వర్షన్ ని వినిపించారు . అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు తారక్ పై హ్యూజ్ ట్రోల్లింగ్ జరుగుతుంది . ఎందుకు మోహన్ కృష్ణ ఆ పేరుని గట్టిగా నొక్కి చెప్పి ఇలా మాట్లాడారు ..?అంటూ చర్చించుకుంటున్నారు జనాలు . అయితే తారక్ కి తాత పెట్టిన పేరు అని ఈ ఎన్ టీఆర్ కి  పుట్టుకతోనే మేం పెట్టిన పేరు అని గుర్తు చేస్తున్నాడు అని పరోక్షంగా తారక్ ని టార్గెట్ చేసి మాట్లాడాడు అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు తారక్ - నందమూరి తారకరామారావు పేరుపై  వార్తలు ట్రెండింగ్ లోకి వచ్చాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: