
దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్నో ప్రత్యేకతలతో, యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాకు ఇప్పటికే రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ సాధించడం పవన్ కళ్యాణ్ కు సైతం కీలకం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతమయ్యాయి.
హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ ఎంట్రీ సీన్ అదిరిపోతుందని సమాచారం అందుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ హీరో రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.