
ఈ కాంబినేషన్లో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొరటాల శివ ఆచార్య సినిమాకు ముందు వరకు అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి క్రేజీ కాంబినేషన్లో కొరటాల శివ తర్కెక్కించిన ఆచార్య సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో పాటు కొరటాల పరువు మొత్తం గంగలో కలిపేసింది. ఆ తర్వాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో కసితో దేవర సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇక ఇటీవల సంక్రాంతికి బాల్యతో డాకు మహారాజు లాంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన సితార నాగవంశీ ఇప్పుడు బాలయ్య - కొరటాల కాంబినేషన్లో కూడా ఓ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇది సెట్స్ మీదకు వెళితే ఇది కచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అవుతుంది అనటంలో సందేహం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు