
బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ కూడ ఈ మూవీతో కలక్షన్స్ పరంగా తమ ఇండస్ట్రీకి పూర్వ వైభవం వస్తుందని ఆశ పడుతోంది. ఇలాంటి పరిస్థితులలో విడుదలైన ఈసినిమాకు సంబంధించిన మూడున్నర నిమిషాల సుదీర్ఘమైన ట్రైలర్ లో ఈమూవీ కథ అంతా పూర్తిగా చెప్పేశారు. తన ప్రవర్తన కారణంగా బాస్కెట్ బాల్ కోచ్ కు కోర్టు విచిత్ర శిక్ష విదిస్తుంది మానసిక ఎదుగుదల సరిగా లేని ఒక బృందానికి కోచింగ్ ఇవ్వమని చెపుతుంది.
అలాంటి కోచింగ్ ఇవ్వడం హీరోకి ఇష్టం లేకపోయినా ఆబాధ్యతను తీసుకుంటాడు. ఈ పరిస్థితులలో చిత్ర విచిత్రంగా ఉన్న వాళ్ళ ప్రవర్తనలను ఒక తాటిపైకి తీసుకొచ్చి మ్యాచ్ ఎలా గెలిపించాడు అన్న పాయింట్ చుట్టూ ఈమూవీ కథ నడుస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా చూస్తే గతంలో అమీర్ ఖాన్ నిర్మించిన ‘తారే జమీన్ పర్ చెక్ దే ఇండియా’ ‘దంగల్’ సినిమాల ఛాయలు ఈమూవీలో కనిపిస్తున్నాయి.
అయితే అమీర్ ఖాన్ తన అద్భుతమైన నటనతో ఈమూవీలో ఏదో ఒక మ్యాజిక్ చేసి ఉంటాడని భావిస్తున్నప్పటికీ ఈ పాత వాసనలు కారణంతో సగటు ప్రేక్షకుడుకి మళ్ళీ పాత సినిమానే చూసినట్లు అనిపిస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈమధ్యకాలంలో బాలీవుడ్ లో విడుదలైన ‘రైడ్ 2’ సినిమా కొంత వరకు కలక్షన్స్ బాగానే ఉన్నా బాలీవుడ్ ఇండస్ట్రీ కోరుకుంటున్న బ్లాక్ బష్టర్ హిట్ ఇంకా రావడంలేదు మరి ఆలోటును అమీర్ ఖాన్ ఎంతవరకు తీర్చగలడో చూడాలి..