మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో సినిమాలలో తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. కాగా వరుణ్ తేజ్ ప్రముఖ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి అంతరిక్షం సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చాలా సంవత్సరాల పాటు సీక్రెట్ గా ప్రేమించుకున్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. 

వీరి వివాహం గత సంవత్సరం ఆగస్టు నెలలో జరిగింది. వివాహం తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు పూర్తిగా దూరమైంది. తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయించింది. ఇక అతి తక్కువ సమయంలోనే లావణ్య, వరుణ్ తేజ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వారి సోషల్ మీడియా అకౌంట్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన అనంతరం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ అభిమానులు, కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలుతున్నారు. 


ఇక ప్రెగ్నెంట్ అయిన వారికి చాలా రకాల ఆహారాలు తినాలని ఎంతగానో కోరిక ఉంటుంది. అలానే లావణ్య త్రిపాఠి కోరికను తీర్చడానికి వరుణ్ తేజ్ షెఫ్ గా మారిపోయాడు. తన భార్య కోసం వరుణ్ తేజ్ స్వయంగా పిజ్జా తయారు చేసి తన భార్యకు తినిపించారు. తానే దగ్గరుండి అన్ని కట్ చేసి తన చేతుల మీదుగా రెస్టారెంట్ స్టైల్ లో పిజ్జాను తన భార్యకు అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను లావణ్య తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తన ఇష్ట ఇష్టాలను తెలుసుకొని దగ్గరుండి మరి అన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ మంచి మనసులు మెచ్చుకుంటున్నారు. సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన భార్య కోసం దగ్గరుండి ఇలా చేయడంతో సంతోషంలో మునిగితేలుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: