తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప‌ పేరు ప్రఖ్యాతలు కలిగిన అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటివరకు మూడు తరాల హీరోలు ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఏఎన్ఆర్ తనయుడిగా సినీ గడప తొక్కిన నాగార్జున.. నటుడుగానే కాకుండా నిర్మాతగా, స్టూడియో అధినేతగా సూపర్ సక్సెస్ అయ్యారు. అక్కినేని లెగ‌సీని ముందుకు న‌డిపించారు. ఆ తర్వాతి కాలంలో నాగార్జున వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.


ఇప్పటికే నాగచైతన్య తానేంటో ప్రూఫ్ చేసుకున్నాడు. అఖిల్‌ కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతోంది. సరైన బ్రేక్ కోసం అయ్యగారు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే తండ్రీ కొడుకులైనా నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ ఎవరు తెలుసా..? ఆ లక్కీ ఛాన్స్ ఇప్పటివరకు కేవలం ఒక్క హీరోయిన్ కు మాత్రమే దక్కింది. ఇంతకీ ఆ లక్కీ బ్యూటీ మరెవరో కాదు పూజా హెగ్డే.


మొదటిగా పూజా హెగ్డే నాగచైతన్య తో కలిసి నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం `ఒక లైలా కోసం`. ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ.. చైతూ-పూజా జంటకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మూవీలో అఖిల్‌ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. రొమాంటిక్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ చిత్రం హిట్ గా నిలిచింది. ఇక నాగార్జునతో సినిమా చేయకపోయినప్పటికీ మాజా యాడ్ లో కలిసి యాక్ట్ చేసింది. ఆ విధంగా తండ్రి కొడుకులైనా ముగ్గురు అక్కినేని హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్‌గా నిలిచింది పూజా హెగ్డే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: