తెలుగు సినీ పరిశ్రమ లో నటుడి గా తన కంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నవీన్ చంద్ర ఒకరు. ఈయన హను రాఘవపూడి దర్శకత్వం లో రూపొందిన అందాల రాక్షసి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు . ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో నవీన్ చంద్ర పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండటంతో ఈ సినిమా ద్వారా ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత నుండి ఈయన తెలుగు లో అనేక సినిమాలలో నటిస్తూ అద్భుతమైన బిజీగా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. శ్రీ లీలా ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నవీన్ చంద్ర ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా నవీన్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా నవీన్ చంద్ర "మాస్ జాతర" సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చింది అనే వివరాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ ... ఒక రోజు నాకు సితార ఎంటర్టైన్మెంట్ ఆఫీస్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. రవితేజ గారు మాస్ జాతర సినిమాలో నిన్ను విలన్ పాత్రకు రికమెండ్ చేశారు అని వారు చెప్పారు. మాస్ జాతర సినిమాలో నా పాత్ర ఒక అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. సినిమాలో నేను ఒక స్పెషల్ లుక్ లో కనిపించబోతున్నాను అని నవీన్ చంద్ర తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc