
ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను వినోదాన్ని పంచేందుకు ఒక సూపర్ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేదాం.. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదలై మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ మూవీకి డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి వీక్షించండి.
అలాగే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ది డిప్లోమ్యాట్, ది మ్యాచ్, లాస్ట్ బుల్లెట్, నోన్నాస్, బ్యాడ్ ఇన్ ఫ్యూయెన్స్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే ది రాయల్స్, ఫరెవర్, బ్లడ్ ఆఫ్ జెసు అనే వెబ్ సిరీస్ లు ఆడుగుతున్నాయి. ఎ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.