నటి అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ తెలుగు, హిందీలో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోయింది. లైగర్ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అనన్య పాండే నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.

ఈ చిత్రం తర్వాత అనన్య పాండే తెలుగులో వరుసగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. కాగా అనన్య పాండే తాజాగా తనకు సంబంధించిన ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు. రీసెంట్ గా అనన్య పాండే ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.


అందులో భాగంగా తాను 18 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీకి వచ్చానని ఆ సమయంలో చాలా సన్నగా ఉన్నావని ఎంతోమంది నన్ను ఎగతాళి చేశారంటూ అనన్య పాండే గుర్తు చేసుకున్నారు. నీ కాళ్లు చికెన్ లెగ్స్, అగ్గిపుల్లల లాగా ఉన్నాయని బాడీ షేమింగ్ చేశారు. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ నా శరీరం నేచురల్ గా ఎదిగింది. ఆ సమయంలో సర్జరీలు చేయించుకున్నావని మళ్లీ విమర్శలు చేశారు.

 చాలామంది మహిళలు సినిమా పరిశ్రమలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటారని అనన్య పాండే చెప్పుకొచ్చింది. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళితేనే మనం విజయం సాధించగలమని అనన్య పాండే అన్నారు. ఏదో ఒకటి అనడం మానవులకు అలవాటు. పాడిన పట్టించుకోకూడదు అని అనన్య పాండే వెల్లడించారు. ప్రస్తుతం అనన్య పాండే షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: