ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే అద్భుతమైన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో అనన్య పాండే ఒకరు. ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ తన అందాలతో నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి అద్భుతమైన రేంజ్ లో క్రేజ్ నీ సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ "లైగర్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ ద్వారా అనన్య పాండే కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె కెరియర్ ప్రారంభంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాను అని విషయాలను చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... నేను 18 సంవత్సరాల వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉండే దానిని. దానితో అనేక మంది నన్ను నీ కాళ్లు చికెన్ లెగ్స్ లా ఉన్నాయి. అగ్గి పుల్లల్లా ఉన్నాయి అంటూ బాడీ షేవింగ్ చేసేవారు. ఆ తర్వాత నా శరీరం నాచురల్ గా ఎదిగితే కూడా సర్జరీలు చేయించుకున్నారు అన్నారు. ఇలా అనేక మంది నన్ను కెరియర్ ప్రారంభంలో అనేక మాటలతో ఇబ్బంది పెట్టారు అని అనన్య పాండే తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: