
దానికి కారణం డబ్బు. రష్మిక తన సినిమాలకి రెమ్యూనరేషన్ హై తీసుకుంటుంది అన్న విషయం అందరికీ తెలుసు . పలువురు మేకర్స్ కూడా రష్మిక రేంజ్ కి మేము తట్టుకోలేం అంటూ పరోక్షికంగానే పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు . రీసెంట్ గా హీరో సూర్య తన డైరెక్టర్ తెలుగు మొదటి సినిమాను ప్రారంభించారు. వెంకి అట్లూరి - సూర్య కాంబో లో ఒక సినిమా ఫిక్స్ అయింది. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్గా మమితా బైజుని సెలెక్ట్ చేసుకున్నారు మూవీ టీం.
నిజానికి ఈ ప్లేస్ లో రష్మిక మందన్నా అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . టాక్ కూడా అలాగే వినిపించింది . మేకర్స్ ఆల్మోస్ట్ ఆల్ రష్మికకు అడ్వాన్స్ చెక్ ఇచ్చే అంత రేంజ్ కి కూడా ఫిక్స్ అయిపోయారట. కానీ రష్మిక మాత్రం తన మార్కేట్ ఇప్పుడు పెరిగిపోయింది అని రెమ్యూనరేషన్ హై ఇవ్వాలి అని ఒకప్పుడు ఐదు కోట్లు తీసుకునే రష్మిక ఇప్పుడు సినిమాకి పది కోట్లు డిమాండ్ చేసిందట . వెంకీ సినిమా కోసం ఆమె ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసింది అన్న వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో మేకర్స్ తట్టుకోలేక కొత్త హీరోయిన్ మమితను తీసుకున్నారు. మలయాళీ బ్యూటీ కొంచెం గట్టిదే . రెమ్యూనత్రేషన్ డిమాండ్ చేయకుండా స్టార్ హీరో సూర్య నా ఫేవరెట్ అంటూ ఆయన సినిమాలో నటించే ఛాన్స్ రావడం అదృష్టం అంటూ సినిమాకి వెంటనే సైన్ చేసేసింది . ఈ సినిమాకి కోటి రూపాయలు మాత్రమే పారితోషకంగా తీసుకుంటుందట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూండడంతో రష్మిక కి షాక్ ఇచ్చిన మమిత బైజు అంటూ ఘాటుగా కౌంటర్స్ పేలుతున్నాయి..!