
అలా ఇప్పటికే కొన్ని సినిమాల పరిస్థితిలు ఇబ్బందులు ఎదుర్కున్నాయి. ఇప్పుడు తాజాగా భైరవం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్ట్ మాట్లాడిన మాటలు భైరవం సినిమా ని బాయ్ కాట్ చేసేలా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ విజయ్ కనకమెడల.."ఇలా మాట్లాడుతూ ధర్మం కాపాడడానికి ఏడాది క్రితం ఒకరు వచ్చారు.. అంటూ ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడా.. అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడడానికి భైరవ వస్తాడు అంటూ చెప్పారు". అయితే సినిమాలకు రాజకీయాలకు సంబంధం లేదని సినిమా ఈవెంట్లో మాట్లాడడంతో ఇప్పుడు ట్రెండీగా బాయ్ కాట్ బైరవం అనే సినిమా కనిపిస్తోంది.
దీంతో చాలామంది డైరెక్టర్ విజయ్ నీ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఈవెంట్లకు హాజరైనప్పుడు కూడా సినిమా గురించి కంటే రాజకీయాల గురించి మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారు. మొదట రిపబ్లిక్ సినిమా సమయంలో సాయి ధరంతేజ్ మాట్లాడడంతో అప్పటినుంచి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత లైలా విషయంలో పృధ్విరాజ్ మాట్లాడగా భారీ దెబ్బ పడింది. అలాగే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో సన్నివేశాల పైన పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీ రాజకీయాలను ముడి పెడితూ సినిమాలను తీసిన.. సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడిన పరిస్థితులు ఎలా ఉంటాయో గడిచిన సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఇకనైనా సినీ ఇండస్ట్రీ మేలుకోకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.మరి భైరవం సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.