ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమాతో పాటు త్వరలోనే స్పిరిట్ సినిమా షూటింగ్లో పాల్గొనాలని చూస్తున్నారు. ఇప్పటికే ది రాజా సాబ్ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితిలో పడింది. ఈ నేపథ్యంలోనే ఓవైపు ది ర రాజా సాబ్ మూవీ కి సంబంధించి పనులు చూసుకుంటూనే మరోవైపు ఫాజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. అయితే తాజాగా టాలీవుడ్ మీడియా వర్గం నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ప్రభాస్ కి హను రాఘవపూడి కి మధ్య షూటింగ్ సెట్ లోనే గొడవ జరిగిందట. అంతే కాదు ప్రభాస్ హనూ రాఘవపూడికి వార్నింగ్ కూడా ఇచ్చారట.. మరి ఇంతకీ ప్రభాస్ కి హనూ రాఘవపూడికి మధ్య జరిగిన గొడవ ఏంటి.. ఎందుకు ప్రభాస్ వార్నింగ్ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.. 

హనూ రాఘవపూడికి ప్రభాస్ వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఆయన షూటింగ్ సెట్లో ఎక్కువ కోపంగా ఉండటమే. ప్రతిసారి అందరిమీద అరుస్తూ హడావిడి చేసేస్తూ ఏ విషయానికైనా సరే చాలా తొందరపడి చిత్ర యూనిట్ లో ఉన్న కొంతమంది మీద అరుస్తూ ఉంటారట. అయితే ఈ విషయం నచ్చని ప్రభాస్ వెంటనే హనూ రాఘవపూడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారట.. హడావిడి చేసేసి సినిమాని తొందరగా ఫినిష్ చేద్దాం అని అనుకుంటున్నావు.కాస్త కూల్ గా ఉండి ఆలోచించు.. ప్రతి దానికి ఇలా చిరాకు పడుతూ ఇతరులపై కోపం తెచ్చుకోకు.. ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు..షూటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవించాలి.

అలా అయితేనే సినిమా షూటింగ్ ముందుకు వెళ్తుంది.హడావిడి చేసేస్తే సినిమా షూటింగ్ పూర్తి అవ్వదు అంటూ హనూ రాఘవపూడికి ప్రభాస్ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారట.. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి ప్రభాస్ చెప్పిన మాటలు విని ఆలోచనలో పడ్డ హనూ రాఘవపూడి వెంటనే ప్రభాస్ చెప్పినట్టే నడుచుకోవాలి అని ఫిక్స్ అయ్యారట.కానీ ప్రభాస్ హనూ రాఘవపూడికి వార్నింగ్ ఇచ్చారు అంటూ ఓ వార్త మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ఇక ఫౌజీ మూవీ అటకెక్కినట్టేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.కానీ షూటింగ్ సెట్లో వీరిద్దరి మధ్య జరిగింది  మాత్రం ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: