
అయితే తాజాగా ఈ కేసు విషయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. గత కొన్ని నెలలుగా ఈ కేసును విచారించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. తెలంగాణ పోలీసులకు అలాగే telangana CM రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. సంధ్య థియేటర్ ఘటన వెనుక సివి ఆనంద్ కు నోటీసులు కూడా జారీ చేసింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సంధ్య థియేటర్లో పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కసలాటకు సంబంధించిన పూర్తి నివేదిక అంద జేయలేదని.... పేర్కొంది. జనవరిలో ఈ నివేదిక అందాల్సి ఉండేదని.. కానీ తెలంగాణ పోలీసులు నిర్లక్ష్యం చేసినట్లు ఫైర్ అయింది..
పోలీసులు ఇచ్చిన నివేదికలలో సరైన వివరాలు లేవని పేర్కొంది. పోలీస్ స్టేషన్కు సమీపంలో డీజేలు అలాగే హంగామా నడుస్తుంటే ఏం చేశారని నిలదీసింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. హీరో అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని అలాగే లాఠీచార్జి చేయలేదని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. అసలు స్పెషల్ అశోకు అనుమతి ఇవ్వనప్పుడు అల్లు అర్జున్ థియేటర్కు ఎలా వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఇందులో భాగంగానే తాజాగా సివి ఆనందుకు నోటీసులు జారీ చేసింది.