బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమితా బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . అమితాబ్ ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు . ఇప్పటికి కూడా అమితా బచ్చన్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు . కొంత కాలం క్రితం అమితాబ్ , ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

మూవీ లోని అమితాబ్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇకపోతే హిందీ లో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షో లలో కౌన్ బానేగా కరోడ్పతి షో ఒకటి. ఈ షో కు చాలా సంవత్సరాల నుండి అమితా బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షో నుండి అమితా బచ్చన్ తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దానితో హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సల్మాన్ ఖాన్ , అమితాబ్ స్థానంలో ఆ షో కి హోస్ట్ గా వ్యవహరించ బోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కౌన్ బానేగ కరోడ్పతి టీవీ షో సంస్థ వారు అమితా బచ్చన్ స్థానంలో సల్మాన్ ఖాన్ ను తీసుకోవడానికి అగ్రిమెంటు కూడా పూర్తి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం సల్మాన్ ఖాన్ "సికిందర్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: