మెగా హీరో అల్లు అర్జున్ గురించి చెప్పనవసరం లేదు. ఈ హీరో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు, ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలోనూ నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా తన హవాను కొనసాగిస్తున్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ హీరోతో సినిమాలు చేయడానికి ప్రతి ఒక్క దర్శకుడు ఆసక్తిని చూపిస్తున్నారు.

 ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ రెస్ట్ మోడ్ లో ఉన్నారు. వెకేషన్స్ కి వెళ్తూ తన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నారు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ బయటకు వెళ్లి వస్తున్న సమయంలో తన ఇంటి ముందు ఉన్న కాంపౌండ్ వాల్ మీది నుంచి కారును తీసుకువెళ్లారు. దీంతో ఈ వీడియో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.

 అల్లు అర్జున్ తాగి డ్రైవింగ్ చేశాడని కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నార్మల్ గా ఉంటే అలా గోడ పైకి ఎందుకు ఎక్కిస్తాడని సీరియస్ అవుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి అల్లు అర్జున్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. తాను ఏం మాట్లాడినా ఎలాంటి పనులు చేసిన అవి వివాహస్పదంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ విషయం పైన అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వాలని కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ విషయం పైన అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: