ఎగ్జిబిటర్ లు థియేటర్ లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎగ్జిబిటర్ ల నిర్ణయంపై టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ స్పందించారు. ఘటికాచలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ఆడియన్స్ మార్నింగ్ షోలకు రావడం మానేశారని అన్నారు. కేవలం ఈవినింగ్ షోలకు.. అలాగే వీకెండ్స్ లలో థియేటర్లకు వస్తున్నారని తెలిపారు. వీకెండ్స్ లో ఎక్కువ ధరలు పెట్టి వీక్ డేస్ లో టికెట్ ధరలు తగిస్తే బెట్టర్ అని అన్నారు. అలా అయితే స్టూడెంట్స్ వీక్ డేస్ లో థియేటర్ లోకి వస్తారని చెప్పారు. 

అలాగే ఇప్పుడున్న యువత థియేటర్లలోకి వచ్చి సినిమాలు చూసే రోజులు పోయాయని తెలిపారు. రెండు, మూడు వారాల్లోనే ఓటీటీలోకి సినిమాలు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లడం ఎందుకని ఓటీటీలోనే సినిమాలు చూస్తున్నారని స్పష్టం చేశారు. ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఎక్కువ కాలం సినిమా ఓటీటీలోకి రాకుండా జాగ్రత్త పడితే బాగుంటుందని వెల్లడించారు. అలాగే థియేటర్లలో తినుబండరాళ్ల ధరలు కూడా చాలా ఎక్కువగా  ఉన్నాయని.. అందువల్లే ఆడియన్స్ థియేటర్లకు దూరమవుతున్నారని చెప్పుకొచ్చారు. నాన్ థియేట్రికల్ రేట్స్ తగ్గినప్పటికీ, నటీనటుల రెమ్యూనిరేషన్ మాత్రం తగ్గట్లేదు అని నిర్మాత అన్నారు. అవసరమైన విషయాలను వదిలేసి.. అనవసరమైన వాటిపై దృష్టి పెడుతున్నారని తెలిపారు. గుండెనొప్పి వచ్చి పేషెంట్ హాస్పిటల్ కి వెళ్తే.. ఆయనకు ఫేసియల్ చేద్దామా, పెడిక్యూర్ చేద్దామా అన్నట్లు ఉందని నిర్మాత ఎస్‌కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల థియేటర్ ల సమస్యలను తెలిపేందుకు ఎగ్జిబిటర్ లు ఓ సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్ లో సమస్యలను పరిష్కరించాలని.. లేకపోతే తెలుగు రాష్ట్రాలలో థియేటర్ లు బంద్ చేస్తామని వెల్లడించారు. ఇక ఈ వార్త వినగానే సినీ ప్రియులతో పాటుగా, నిర్మాతలు కూడా ఉలిక్కిపడ్డారు. రోజురోజుకి ప్రేక్షకులు థియేటర్ లలోకి రావడమే మానేశారని ఎగ్జిబిటర్ చెప్పారు.  ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, పైరసీల వల్ల సినిమా థియేటర్ ల ఆదాయం చాలా తగ్గిపోయిందని తెలిపారు.  వారి సమస్యలకు పరిష్కారం కోరుతూ వచ్చే నెల 1వ తేదీ నుండి థియేటర్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: