ఏపీ, తెలంగాణలో సినిమా థియేటర్ లను ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ లను బందు చేయాలని ఎగ్జిబిటర్ లో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న అదే ఆధారిత రెవెన్యూ మోడల్ పై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల థియేటర్ ల బంద్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు. మళ్ళీ జూన్ 1 నుండి థియేటర్లు బంద్ చేస్తున్నామని బంధు వాయిదా పడింది అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు సినిమా ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ లు సమావేశం అయ్యారు. 

ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించినట్టుగా జూన్ 1 నుండి థియేటర్ల బంద్ ఉండదని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శనలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆల్ సెట్టర్ల మీటింగ్ తర్వాత అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, సమస్యలపై మే 30న కమిటీ వేస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. దానికి కారణం జూన్ లో అనేక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాలు సైతం జూన్ లో విడుదల కాబోతున్నాయి. జూన్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సైతం ఉంది. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. అదే విధంగా మంచు విష్ణు నటించిన కన్నప్ప, కుబేర, భైరవం లాంటి ముఖ్యమైన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్ లో బంద్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఈ సినిమాలను మిస్ అవుతామని ఆందోళన చెందారు. కానీ తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయంతో ఈ సినిమాలు వాయిదా పడకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: