
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ వివాదం ఇప్పుడు చాలా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం .. ఆ వెంటనే సినీ రంగానికి చెందిన పెద్దలు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ తమకు బంద్‌కు సంబంధం లేదని వార్నింగ్‌లు ఇవ్వడం జరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్ల బంద్ వ్యవహారం వెనక పెద్ద కుట్రే జరిగిందని.. కొందరు థియేటర్లు తమ చేతుల్లో ఉన్నాయన్న వాటిని బంద్ చేయించేందుకు ప్రయత్నాలు చేశారంటూ పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఈ వివాదం పై పవన్ ప్రభుత్వ పరంగా కూడా పలు సూచనలు చేశారు. థియేటర్ల నిర్వహణ సరిగా లేదని ఆయన ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఇక ఈ వివాదంలో జనసేన కు చెందిన ఓ కీలక నేత.. ఓ నియోజకవర్గ ఇన్ చార్జ్‌ను ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆసక్తి గా మారింది. ఆ నేత ఎవరో కాదు .. జనసేన పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గం ఇంచార్జి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణపై ఆరోపణలు వచ్చాయని .. ఆయనను తమ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఓ లేఖ విడుదల అయ్యింది. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఇక ఈ థియేటర్ల బంద్ వివాదంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు