టాలీవుడ్ హీరో, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనబ్ రవ్జీతో గత కొన్నాళ్ల నుంచి రహస్యంగా ప్రేమాయణం నడిపిస్తున్న అఖిల్.‌. పెద్దల అంగీకారంతో గత ఏడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆ తర్వాత అఖిల్, జైనబ్ ప‌లుమార్లు జంట‌గా క‌నించారు. క‌లిసి వికేష‌న్స్ కు వెళ్తూ ఎయిర్‌పోర్ట్స్‌లో త‌ళుక్కుమ‌న్నారు.


అయితే అఖిల్, జైనబ్ ల వివాహానికి సమయం దగ్గర పడినట్టు బలంగా ప్రచారం జరుగుతుంది. జూన్ 6న వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని.. ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు కూడా ప్రారంభం అయ్యాయ‌ని తెలుస్తోంది. అయితే త‌న పెళ్లి విష‌యంలో అన్న చైతూనే ఫాలో అవ్వాల‌ని అఖిల్ నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. సమంతతో విడిపోయాక‌ నాగచైతన్య ప్ర‌ముఖ న‌టి శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ లో వీరి వెడ్డింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది.


ఇప్పుడు అఖిల్ సైతం అక్కడే వివాహం చేసుకోవాలని భావిస్తున్నాడట. అఖిల్‌-జైనబ్ జంట ఫారెన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని గ‌తంలో వార్తలు వచ్చాయి. కానీ అవి పుకార్లే అట‌. అన్న చైతూ మాదిరిగానే అన్నపూర్ణ స్డూడియోస్ లో తాత‌గారి విగ్రహం ఎదురుగా జైన‌బ్ తో క‌లిసి ఏడ‌డుగులు వేయాల‌ని అఖిల్ ఫిక్స్ అయ్యాడ‌ట‌. ఇందుకు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ట‌. ఇక జూన్ 8వ తేదీన రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ను నిర్వ‌హించ‌నున్నార‌ని కూడా తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: