సినిమా ఇండస్ట్రీలో హీరోగా హీరోయిన్లుగా రావాలి అంటే అందం ఉండాలి ..టాలెంట్ ఉండాలి ..సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండాలి. ఇవన్నీ  ఉండకపోయినా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ నాన్న కాని వాళ్ళ తాత కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్న ఈజీగా వచ్చేయొచ్చు . సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు స్టార్స్ గా ఉన్నవాళ్లంతా బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ తోనే వచ్చిన వాళ్ళు . సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ కిడ్స్ అలా చేస్తూ ఉంటారు . అయితే కొందరు మాత్రం ఈ కల్చర్ ని అంత ఈజీగా ఇష్టపడరు. ఆ కారణంగానే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు . అలా దూరంగా ఉన్న వారిలో ఒకరే జాన్వి మెహతా .


ఈమె హీరోయిన్ కి మించిన అందంగా ఉంటుంది . మంచి టాలెంటెడ్ . ఈమె ఎవరో కాదు ఒకప్పుడు ఇండస్ట్రీని తన అంద చందాలతో అల్లాడించేసిన జుహీ చావ్లా కూతురు . కోట్లల్లో ఆస్తి .. ఇండస్ట్రీలో పెద్దపెద్ద వారితో పరిచయాలు.. కూడా ఉన్నాయి.  మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ గా పేరు సంపాదించుకున్న షారుక్ ఖాన్ తో జాన్ జిగిడి సంబంధమే ఉంది.  కానీ సినిమాలకు మాత్రం దూరంగా ఉంటుంది . జాన్వి మెహత కి కుటుంబం నుంచి వచ్చిన ఆస్తి ఆమె సంపాదించిన ఆస్తి మొత్తంగా 4200 కోట్లకు పైగానే ఉంటుంది .



కానీ ఆమె మాత్రం సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఆమె బిజినెస్ ..స్పోర్ట్స్ రంగాలలో దూసుకు వెళ్తుంది. జాన్వి మెహతా 2023లో కొలంబియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుంది . అయితే ఆ తర్వాత అందరి స్టార్స్ పిల్లల లా సినిమాలోకి రావాలి అంటూ మోడలింగ్ అంటూ ఎక్స్పోజింగ్ అంటూ తన టైం వేస్ట్ చేసుకోలేదు .. తనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకుంది . చిన్నప్పటినుంచి బిజినెస్ అంటే చాలా ఇష్టం . అందుకే అదే రంగంలో స్థిరపడాలి అంటూ ట్రై చేసింది.  అలాగే స్థిరపడింది.

 

ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ చక్కగా లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది . జాన్వి మొదటిసారిగా ఐపిఎల్ 2022 వేలం పాటలో అందరి దృష్టిని ఆకర్షించింది.  షారుక్ ఖాన్ పిల్లలు ఆర్యన్ , సుహానలతో కలిసి కోల్కత్తా నైట్ రైడర్స్ అకేషనల్ టేబుల్ పై సందడి చేసింది . ఎప్పుడైతే ఐపీఎల్ వేలం పాటలో కనిపించిందో జాన్వి అప్పటినుంచి అందరూ ఐపీఎల్ గర్ల్ అంటూ పిలవడం ప్రారంభించారు . సోషల్ మీడియా మొత్తం ఆమె పేరు అలానే మారుమ్రోగిపోతూ ఉంటుంది . అమెరికా, కెనడా ,ఉగాండా, కెన్యా వంటి దేశాలలో మెహతా గ్రూప్ లో వీరికి  భారీగా వాటాలు ఉన్నాయి . అందుతున్న సమాచారం ప్రకారం జూహీ చావ్లా ఆస్తి 4600 కోట్లు మెహతా గ్రూప్ ఆస్తులు 500 మిలియన్ల డాలర్లకు పైగా సుమారు 4215 కోట్లు ఉంటుందని అంచనా..!

మరింత సమాచారం తెలుసుకోండి: