
అయితే ఫ్యాన్స్ మాత్రం వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే రచ్చ రంబోలా చేసేస్తున్నారు . శుక్రవారం మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన "ఖలేజా" సినిమా రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే . "ఖలేజా" సినిమా అనగానే మహేష్ బాబు అభిమానులు కొంతమంది సంతోషపడితే కొంతమంది మాత్రం "అబ్బా వద్దురా నాయన " అనే రేంజ్ లోనే మాట్లాడుకుంటారు. అది ఎందుకో కూడా అందరికీ తెలుసు . కానీ రీ రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకునేస్తుంది.
మరీ ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు రకరకాలుగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు . ఏకంగా ఊఅ అభిమాని పామును ధియేటర్ లోకి తీసుకొచ్చాడు. కాగా ఇలాంటి మూమెంట్లోనే త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన "ఖలేజా" సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి. అయితే సాధారణంగా మహేష్ బాబు తన సినిమా కోసం బ్యాక్ టు బ్యాక్ కాల్ షీట్స్ ఎప్పుడు ఇవ్వరు. కచ్చితంగా కొంచెం గ్యాప్ తీసుకుంటాడు . కచ్చితంగా మూడు షెడ్యూల్స్ గ్యాప్ అయినా తీసుకుంటాడు .దానికి కారణం ఆయన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లడానికి . అయితే ఖలేజా సినిమా కోసం మాత్రం మహేష్ బాబు అస్సలు టైం గ్యాప్ తీసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ అన్ని కాల్ షీట్స్ రెగ్యులర్గా ఇచ్చేసి చకచకా ఆరు నెలల్లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసాడు . ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం కూడా ఈ విధంగా కాల్ షీట్స్ ఇవ్వలేదు . ఇదే విషయాన్ని మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!