
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మళ్లీ తన మార్క్ స్పీడ్ తో చకచకా సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. లేటెస్ట్గా మాస్ జాతర సినిమా తర్వాత రవితేజ నుంచి తర్వాత సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తో అనౌన్స్ చేయటం జరిగింది. అంతేకాకుండా అక్కడ నుంచి షూటింగ్ మొత్తం సెట్ చేయడం చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే వారిలో తన సినిమాతో నే ఎంట్రీ ఇచ్చిన ఓ హీరోయిన్ ను ఇప్పుడు రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ భామ ఎవరో ? కాదు ఖిలాడి బ్యూటీ హీరోయిన్ డింపుల్ హయతి.
ఖిలాడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయతీ తర్వాత గోపీచంద్ తో రామబాణం లాంటి సినిమాలు చేసినా ఆమెను పెద్దగా ఎవరు గుర్తుపెట్టుకోలేదు. డింపుల్ హయతీ రవితేజతో ఖిలాడీ ఆ తర్వాత చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్ అయ్యాయి. ఆమెను అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మరోసారి ఆమెకు రవితేజ అవకాశం ఇవ్వటం ఆసక్తికరం. ఇటు రవితే జ కు కూడా సరైన హిట్ లేదు. ఈ టైంలో డింపుల్ హయతి కి అవకాశం ఏంటో ? అని అందరూ షాక్ అవుతున్నారు. ఎస్ఎల్వీ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి ఈ సారి అయినా డింపుల్ దశ తిరుగుతుందేమో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు