
అయితే దీపిక కూడా అలాంటి ట్రోలింగ్ ఘాటుగానే తిప్పి కొట్టింది. సడన్గా దీపిక పదుకొనే ఖాతాలో బిగ్ ఆఫర్ వచ్చి చేరింది . అల్లు అర్జున్ మూవీలో అఫీషియల్ గా దీపిక పదుకొనే హీరోయిన్ అంటూ ఓ సెన్సేషనల్ వీడియోని రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ వీడియోలో కూడా దీపికా పదుకొనే చాలా చాలా గ్లామరస్ గా కనిపించింది . బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇంత గ్లామరస్ గా కనిపించడం దీపిక పదుకొనే ఇదే మొదటిసారి. దీంతో సోషల్ మీడియాలో ఆమె లుక్స్ కూడా వైరల్ అవుతున్నాయి . అయితే అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో హీరోయిన్గా ఎంతో మంది టాప్ బ్యూటీస్ ని అనుకున్నారు అంటూ టాక్ వినిపించింది.
జాన్వి కపూర్ - శ్రద్ధ కపూర్ - సమంత - అలియా భట్ ఇలా టాప్ మోస్ట్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి . అయితే నయనతార కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతుంది అంటూ రూమర్ బాగా సర్కులేట్ అయ్యింది. అట్లీ కూడా నయనతారని ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట . ఆల్రెడీ జవాన్ సినిమాతో ఈ కాంబో క్రేజీ అంటూ కామెంట్స్ దక్కించుకుంది. కానీ బన్నీ మాత్రం నయనతారను సినిమాలో వద్దనే వద్దు అంటూ ఫిక్స్ అయిపోయి అట్లీకి చెప్పేసాడట . గతంలో జరిగిన ఇష్యూస్ కారణమో లేకపోతే ఇప్పుడు ఆ బ్యూటీ నా సినిమాలో వద్దులే అనుకున్నాడో..? రీసన్ ఏంటో తెలియదు కానీ నయనతార మాత్రం సినిమాలో వద్దు అంటూ తెగేసి చెప్పేసాడట .
అంతేకాదు దీపికా పదుకొనే పేరును సజెస్ట్ చేసింది కూడా బన్నీనే అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . బన్నీ బాలీవుడ్ జాన్ జిగిడి దోస్త్ స్పెషల్గా కాల్ చేసి మరి దీపిక పదుకొనే పేరుని రికమెండ్ చేశారట . అంతకుముందు వరకు బన్నీకి దీపిక పదుకొనే మైండ్లో లేదు. జాన్వికపూర్ - సమంత ఇలాంటి వాళ్ళ పేర్లు మైండ్ లో ఉన్నాయ్. కానీ ఆ జాన్ జిగుడి దోస్త్ కాల్ చేసి మరి రికమెండ్ చేయడంతో బన్నీ కూడా దీపిక వైపుకు మల్లాడట. కల్కి సినిమా ద్వారా ఆమె తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టింది. ఇప్పుడు బన్నీ సినిమా ద్వారా మరో యాంగిల్ ని బయట పెట్టబోతుంది అంటూ రిలీజ్ అయిన చిన్న వీడియో ద్వారానే తెలిసిపోతుంది. " దీపు నే హీరోయిన్గా పెట్టుకో" అంటూ ఆ బాలీవుడ్ హీరో బన్నీకి కాల్ చేసి మరి రికమెండ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!