మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఫాంటసీ ఫిల్మ్ `క‌న్న‌ప్ప‌`. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యాన‌ర్ల‌పై మోహ‌న్ బాబు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రంలో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వ‌ర‌కు ఎంద‌రో స్టార్స్ భాగం అయ్యారు. ప్ర‌భాస్ కూడా ఓ స్పెష‌ల్ రోల్‌లో అల‌రించ‌బోతున్నాడు. జూన్ 27న క‌న్న‌ప్ప మూవీ విడుద‌ల కాబోతుంది. ఈ చిత్రంపై అటు మోహ‌న్ బాబు ఇటు విష్ణు చాలా హోప్స్ పెట్టుకున్నారు. కన్న‌ప్ప క‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు.


అయితే ఇటువంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అవుతుంటుంది. కానీ క‌న్న‌ప్ప విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. ఈ మూవీ ఓటీటీ డీల్ ఇంకా హోల్డ్‌లోనే ఉంది. క‌న్న‌ప్ప‌కు ఓటీటీ ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. వారు చెప్పిన ఫిగ‌ర్‌ మంచు విష్ణుకు ఏమాత్రం న‌చ్చ‌లేద‌ట‌. సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొడ‌తే మాత్రం మంచు విష్ణు అడిగిన రేట్ ఇస్తారని చెప్పార‌ట‌. దాంతో ఆ మొత్తం రెడీ చేసుకోమని మంచు విష్ణు చెప్పాడ‌ట‌.


తాజాగా ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో మంచు విష్ణు స్వ‌యంగా రివీల్ చేశాడు. ఈ లెక్క‌న సినిమాపై మంచు విష్ణు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఆయ‌న కాన్ఫిడెన్స్ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ గా మారితే దెబ్బేయ‌డం ఖాయ‌మ‌ని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, మంచు విష్ణు వెండితెర‌పై క‌న‌ప‌డి దాదాపు మూడేళ్లు కావొస్తొంది. చివరిగా 2022లో `జిన్నా` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. కానీ ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. దీంతో మంచు విష్ణు కెరీర్ కు క‌న్న‌ప్ప కీల‌కంగా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: