కొంతమంది హీరోయిన్లు ఏజ్ పెరిగినా కూడా పాతికేళ్ల వయసులో ఎలా ఉన్నారో అలాగే కనిపిస్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో మీనా కూడా ఒకరు. మీనా కాస్త బరువు పెరిగినప్పటికీ ఆమె ముఖంలో ఉన్న అందం మాత్రం కాస్త కూడా తగ్గలేదు. తన అమాయకపు లుక్స్ తో చబ్బీ చీక్స్ తో ఇప్పటికీ అభిమానులని తన అందాలతో కట్టిపడేస్తుంది. అయితే అలాంటి మీనా విద్యాసాగర్ ని పెళ్లి చేసుకోకముందు ఓ హీరోని చాలా గాఢంగా ప్రేమించిందట.కానీ  బ్యాడ్ లక్ ఆ హీరోతో మీనా పెళ్లి జరగలేదు.. అంతేకాదు ఆ హీరో మీనా కంటే ముందే పెళ్లి కూడా చేసుకున్నాడట.దాంతో మీనా తన హార్ట్ బ్రేక్ అయిపోయినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరి ఇంతకీ మీనా విద్యాసాగర్ కంటే ముందు ప్రేమించిన ఆ హీరో ఎవరు.. ఎందుకు వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు అనేది ఇప్పుడు చూద్దాం.చాలా మంది మామూలు జనాలకు సినీ సెలబ్రిటీలు అంటే ఎలా అయితే ఇష్టం ఉంటుందో అచ్చం అలాగే సినీ సెలబ్రిటీలకు కూడా కొంతమంది హీరో హీరోయిన్లు అంటే క్రష్ ఉంటుంది.అలా సీనియర్ నటి మీనాకి కూడా ఓ హీరో అంటే చెప్పలేనంత ఇష్టమట. అంతేకాదు ఆ హీరోతో తెలియకుండానే ప్రేమలో పడిపోయిందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే హృతిక్ రోషన్..బాలీవుడ్ గ్రీకు వీరుడు గా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆయన కటౌట్ కి చాలామంది మామూలు జనాలే కాదు సినిమా హీరోయిన్లు కూడా పడిపోతారు.
అలా హృతిక్ రోషన్ కటౌట్ కి పడిపోయిన హీరోయిన్లలో సీనియర్ నటి మీనా కూడా ఒకరు. అయితే అప్పట్లో మీనాక్షి కి హృతిక్ రోషన్ అంటే చాలా పిచ్చి ఉండేదట. అంతేకాదు ఇంట్లో వాళ్లతో నేను హృతిక్ రోషన్ నే పెళ్లి చేసుకుంటానని కూడా తెగేసి చెప్పిందట.. అయితే హృతిక్ రోషన్ ని ప్రేమిస్తున్నానని, ఆయన్నే పెళ్లి చేసుకుంటానని,ఆయన కాకపోయినా కనీసం ఆయనలాంటి వాడినైనా పెళ్లి చేసుకుంటాను అంటూ మీనా ప్రతిసారి తన తల్లితో చెప్పేదట.అయితే అప్పట్లో మీనా ఏజ్ తక్కువ కావడంతో ఆమె మాటల్ని తల్లి కూడా అంతగా పట్టించుకునేది కాదట.

కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు హృతిక్ రోషన్ పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలియడంతో మీనా నా హార్ట్ ముక్కలైంది అంటూ చాలా బాధపడిందట.అయితే ఈ విషయాన్ని మీనా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. హృతిక్ రోషన్ అంటే నాకు ఇష్టం అని,ఆయన పెళ్లి చేసుకున్న రోజు నా హృదయం ముక్కలైంది అని చెప్పింది. అయితే అప్పటి పాత వీడియో ఇప్పుడు మళ్ళీ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న మీనా చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని పెళ్లాడింది.కానీ విద్యాసాగర్ కరోనా టైంలో పోస్ట్ కోవిడ్  సమస్యలతో బాధపడుతూ 2022లో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: