- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ వాయిదా పడడంతో అంతా గందరగోళం అయింది. అసలు ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ? వచ్చేవరకు తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు అమెజాన్ తో సంప్రదించాలి .. డేట్లు సరైనవి దొరకాలి .. డిస్ట్రిబ్యూటర్లు .. ఎగ్జిబిటర్లు .. థియేటర్లు ఇచ్చే వాళ్ళు ఓకే చెప్పాలి. ఇవన్నీ కుదిరితే పెద్ద సినిమాలు వస్తాయి .. లేకపోతే మంచి డేట్లు వృధా అయిపోతున్నాయి. ఈ సమ్మర్ అంతా వృధా అయిపోయింది. మంచి సినిమాలు ఒక్క‌టి కూడా రాలేదు. అప్పుడే జూన్ 10వ తేదీ వచ్చేసింది. మే నెలలో వచ్చిన భైరవం ... జూన్ మొదటి వారంలో వచ్చిన కమలహాసన్ థ‌గ్ లైఫ్‌ సినిమాలు నిరాశపరిచాయి. 12న కచ్చితంగా వస్తుందనుకున్న హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడింది.


ఇప్పుడు ఆశలన్నీ 20న వస్తున్న నాగార్జున - ధనుష్ కుబేర ... 27న వస్తున్న మంచి విష్ణు కన్నప్ప మీద ఉన్నాయి. జూలై ఫస్ట్ వీక్ లో తమ్ముడు అంటున్న .. విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా ఉంది. ఈ రెండు సినిమాలలో ఏది వస్తుంది ? ఏది రాదు అన్నది గ్యారెంటీ లేదు. 11న అనుష్క ఘాటీ వస్తుంది. అయితే జూలై 11 కోసం వాయిదా పడిన హరిహర వీరమల్లు చూస్తోంది. ఒకవేళ ఘాటీ రిలీజ్ డేట్ మార్చుకోకపోతే పవన్ కళ్యాణ్ వీర‌మ‌ల్లు ఆగస్టుకు వెళ్ళాలి. అయితే ఒక్క నెల తిరగకుండానే పవన్ ఓజీ వస్తోంది. అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ వీరమల్లు జూలైలోనే రావాలి .. ఓవైపు సినిమాలు తగ్గిపోయాయి. పెద్ద హీరోలు రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. దీని వల్ల ధియేటర్లు బోసిపోతున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు దారుణ పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పేందుకు ఇవే నిదర్శనం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: