టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటులలో నాని ఒకరు. ఈ మధ్య కాలంలో నాని నటించిన చాలా సినిమాలు వరుస పెట్టి మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. తాజాగా నాని , శైలిష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. మే 1 వ తేదీన విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి , మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది.

ఇది ఇలా ఉంటే ఏకంగా నాని "హిట్ ది థర్డ్ కేస్" మూవీ తో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన సికిందర్ మూవీ నే బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తాజాగా సికిందర్ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 6.7 మిలియన్ వ్యూస్ ను దాదాపు రెండు వారాల టైమ్ లో అందుకుంది. ఇకపోతే హిట్ ది థర్డ్ కేస్ మూవీ రెండు వారాల్లో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఏకంగా 6.9 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని సికిందర్ మూవీ ని క్రాస్ చేసింది  ఇలా నాని "హిట్ ది థర్డ్ కేస్" మూవీ తో ఏకంగా బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన సికిందర్ మూవీ నే క్రాస్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: