తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో మంచి ప్రదర్శనను కనబరిచిన సినిమాలకు అలాగే అనేక కేటగిరీలలో నంది అవార్డులను ఇస్తూ వచ్చేవారు. వీటికి అద్భుతమైన క్రేజ్ కూడా ఉండేది. ఇకపోతే 2014 వ సంవత్సరం తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి. ఆ తర్వాత నుండి నంది అవార్డులను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రవేశ పెట్టింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఎవరు ఏ కేటగిరీలలో గద్దర్ అవార్డులను గెలుపొందారు అనే విషయాన్ని కూడా ప్రకటించింది.

పుష్ప సినిమాలోని నటనకు గాను అల్లు అర్జున్ కి గద్దర అవార్డు దక్కింది. నిన్న గద్దర్ అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే అల్లు అర్జున్ తాజాగా గద్దర్ అవార్డు అందుకోవడంపై అట్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. మీకు ఇలాంటి పురస్కారాలు మరెన్నో లభించాలి అని కోరుకుంటున్నాను అని అట్లీ తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇక దీనికి బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు.

థాంక్యూ సార్ ... నెక్స్ట్ టైమ్ ఇద్దరం కలిసి అవార్డు అందుకోవాలి అని కోరుకుంటున్నాను అని బన్నీ , అట్లీ చేసిన పోస్ట్ కు రిప్లై ఇచ్చాడు. ఇకపోతే అదిరిపోయే రేంజ్ కలిగిన బన్నీ , అట్లీ కాంబోలో రూపొందుతున్న సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అద్భుతమైన స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని హాలీవుడ్ రేంజ్ లో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: