టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ తన అందా లతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఆ తర్వాత ఎన్నో మీడి యం రేంజ్ హీరోల సినిమాలలో నటించి , ఆ తర్వాత స్టార్ హీరోల సినిమా ల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరు కొని ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్న ముద్దుగుమ్మలలో ప్రణీత ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొత్తలో చాలా చిన్న చిన్న సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత అనేక మీడియం రేంజ్ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించి కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఇప్పటికీ కూడా స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకొని అందాన్ని మెయింటైన్ చేస్తున్న ప్రణీత అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. దానితో ఈమెకు సంబంధించిన ఫోటోలు కూడా సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇప్పటికి కూడా ఎంతో అందంగా ఉన్నా ఈమె ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటుంది అనే విషయాన్ని తాజాగా ఈమె చెప్పుకొచ్చింది. 

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఓ అభిమాని మీరు ఎందుకు సినిమాల్లో నటించడం లేదు అని ప్రశ్నించాడు. దానికి ప్రణీత సమాధానం ఇస్తూ ... నా పిల్లల వల్లే నేను సినిమాల్లో నటించడం లేదు లేదు అని ఆ అభిమానికి సమాధానం చెప్పింది. అలాగే వాళ్ళను చూసుకోవడానికి సినిమాలకు దూరంగా ఉంటున్నా అని కూడా ప్రణీత తన అభిమాని ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: