
జూలై నెల మెగా హీరోలకి బ్లాక్ బస్టర్ తెచ్చి పెట్టే నెల అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . దానికి కారణం ఇండస్ట్రీలో ఉండే మెగా హీరోలు అందరూ జూలై నెలలో తమ సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ అందుకోవడమే . మొదటిగా "తొలిప్రేమ". పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే తొలిప్రేమ చాలా చాలా స్పెషల్ . ఆయన ఎన్నెన్నో సినిమాలో నటించిన పవన్ ఫ్యాన్స్ కి అందరికీ నచ్చిన మూవీ తొలిప్రేమ. ఈ సినిమా జూలై 24న విడుదలైంది . అంతకుముందు సుస్వాగతం , గోకులంలో సీత , మంచి విజయాలు సాధించిన తొలిప్రేమ సినిమా మాత్రమే ఆయనను పవన్ కళ్యాణ్ అనే పేరు నిలబెట్టుకునేలా చేసింది .
ఇది ఎప్పటికీ ఆయన లైఫ్ లో గుర్తుండిపోయే చిత్రం . అదేవిధంగా చిరంజీవి నటించిన "ఇంద్ర" సినిమా కూడా జూలై 24న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్టే. ఫ్యాక్షన్ సినిమాలు తెలుగులో వరుస విజయాలు సాధిస్తున్న సమయంలో ఫ్యాక్షన్ తో పాటు సందేశాన్ని జోడించి మరి ఈ సినిమాని రిలీజ్ చేశారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా కూడా జూలై నెలలోనే రిలీజ్ అయ్యింది.
జూలై 15 , 1999లో ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా కూడా జులై నెలలోనే రిలీజ్ అయ్యింది. జూలై 31వ తేదీ ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అదే విధంగా మేగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ - పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమా కూడా జూలై 28న రిలీజ్ అయ్యింది. ఇక శంకర్ దాదా జిందాబాద్ సినిమా జులై 27న రిలీజ్ అయ్యింది.
శంకర్ దాదా జిందాబాద్ , బ్రో సినిమాలు కంటెంట్ పరంగా పెద్ద గా ఆకట్టుకోలేకపోయాయి అంటూ కొంతమంది కూడా ట్రోల్ చేశారు . కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం పరవాలేదు అనిపించింది. ఇక వరుణ్ తేజ్ నటించిన "ఫిదా" సినిమా కూడా జులై 21 న రిలీజ్ అయ్యింది. ఇలా మెగా ఫ్యామిలీకి జూలై నెల బాగా కలిసి వచ్చింది . కంటెంట్ బాగున్న సినిమాలు హిట్ అయ్యాయి. కంటెంట్ బాగాలేని సినిమాలు కూడా హిట్ అయ్యాయి అంటూ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అదే విజయం పరంపరలో కొనసాగిస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందాలకు అవధులు ఉండవు . చూద్దాం మరి "హరిహర వీరమల్లు" ఎలాంటి హిట్ అందుకుంటుందో ..????