
సినిమా వాయిదా పడటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సినిమా ప్రకటించిన తేదీకి రిలీజ్ చేయకపోవడం అన్నది అందరికీ సాధ్యం కాదు. అందుకు చాలా కారణాలు ఉంటాయి. ఎంత ప్రణాళికాబద్ధంగా షూటింగ్ జరుపుకున్నా కూడా .. కొన్ని సందర్భాలలో రిలీజ్ వాయిదా పడుతుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలా ఒక పెద్ద సినిమా వాయిదా పడటం టాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రేక్షకులు వాపోతున్నారు. పక్కాగా రిలీజ్ డేట్ లో ప్రకటించి వాయిదా వేయటం కూడా హరిహర వీరమల్లు సినిమా నిర్మాతలకే చెల్లిందని అంటున్నారు. టాలీవుడ్ లో ఎన్నిసార్లు వాయిదా పడిన సినిమా మరేది ఉండదని ... ఇది తొలి సినిమాగా రికార్డు సృష్టించిందని జనాలు చెబుతున్నారు.
గతంలో కొన్ని సినిమాలు సంవత్సరాలు పాటు షూటింగ్ జరుపుకున్నా ... అఫీషియల్ గా ఎన్నిసార్లు రిలీజ్ డేట్ లు ప్రకటించి వాయిదా వేయటం మాత్రం హరిహర వీరమల్లు విషయంలోనే జరిగిందని అంటున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా ఎన్ని సంవత్సరాలు పట్టింది. పవన్ అటు రాజకీయాల్లోకి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటంతో అనుకున్న టైం కు కాల్ షీట్లు ఇవ్వలేదు.. అలా పలుమార్లు ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఈనెల 12న రిలీజ్ చేస్తామని చెప్పిన ఇప్పుడు కొత్తగా జూలై 24 రిలీజ్ డేట్ ప్రకటించారు. మరి ఈ తేదీ కైనా ఈ సినిమా వస్తుందా మరోసారి వాయిదా వేస్తారా ? అన్నది ఆ దేవుడికే తెలియాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు