
టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా తమ్ముడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా .. సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ ఒకటి బయటకు వచ్చేసింది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ఇటీవల ఇంటర్వ్యూలో స్టోరీ ఎలా ఉండబోతుందో ? రివీల్ చేసేసారు. ఈ సినిమాలో సీనియర్ నటి లయ నితిన్ సోదరిగా నటిస్తుందని .. ఈ సినిమా కథ మొత్తం ఒక్క రాత్రిలోనే జరుగుతుందని తెలిపారు.
ఇక ఎమోషన్ , యాక్షన్ తో ఈ కథ ఉండబోతుందని దిల్ రాజు తెలిపారు. సినిమా ఎమోషనల్ + డెప్త్ స్క్రీన్ ప్లే వర్క్ ఈ సినిమాకు చాలా హైలైట్ గా ఉండిపోతుందని .. అలాగే సౌండింగ్ సిస్టంతో పాటు మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని తెలిపారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక, సౌరభ్ సచ్‌దేవా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా జూలై 4న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు