మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైంది. ఈరోజు అనగా జూన్ 27న ఈ సినిమా విడుదలైంది.ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు పడి ట్విట్టర్ ద్వారా సినిమా చూసిన నెటిజెన్లు రివ్యూలు ఇస్తున్నారు.మరి సినిమా చూడడానికి చాలామంది ట్విట్టర్లో వచ్చిన రివ్యూలను ఫాలో అవుతారు కాబట్టి ట్విట్టర్ రివ్యూలు పాజిటివ్ గా ఉంటే సినిమా చూడడానికి వెళ్తారు.నెగిటివ్ గా ఉంటే డబ్బులు  బొక్కలే అని సైలెంట్ గా ఇంట్లోనే ఉండిపోతారు. అయితే తాజాగా యూఎస్ లో కన్నప్ప మూవీకి సంబంధించి ప్రీమియర్ షోస్ పడిపోవడంతో ఈ షోస్ చూసిన చాలా మంది జనాలు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.. ఇక కన్నప్ప సినిమా చూసిన మ్యాక్జిమం జనాలు సినిమాపై పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీకి థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి అంటూ రివ్యూ ఇస్తున్నారు.

 అలాగే శివపార్వతుల పాత్రలో అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ అదరగొట్టేసారని,తిన్నడు అనే పాత్రలో మంచు విష్ణు చివరి గంట దుమ్ము దులిపేసారంటూ రివ్యూ ఇస్తున్నారు. అయితే సినిమా ఫస్టాఫ్ అంతగా ఆసక్తికరంగా లేకపోయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని రివ్యూ ఇస్తున్నారు. అసలు దేవుడు మీద భక్తే లేని తిన్నడు పాత్రలో నటించిన విష్ణు శివ భక్తుడుగా ఎలా మారాడు అనేది ఈ సినిమాలో చూపించారు.. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడంతో మంచు విష్ణుకి అన్ని ఇండస్ట్రీలలో కలిసివచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, మలయాళ ఇండస్ట్రీలో మోహన్ లాల్, తెలుగులో ప్రభాస్, మోహన్ బాబు  తో కన్నప్ప మూవీకి భారీ హైప్ ఏర్పడింది.

 అయితే ఈ సినిమాని చూడాలనుకునే ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకొని థియేటర్లకి వెళ్లకుండా సినిమా బాగుంటుందనే నమ్మకం పెట్టుకొని థియేటర్లోకి వెళ్ళండి కచ్చితంగా సినిమా నచ్చుతుంది అని ఇంకొంతమంది రివ్యూ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాలో న్యూజిలాండ్ అందాలని అద్భుతంగా చూపించారని, ఈ సినిమా కారణంగా న్యూజిలాండ్ కి పర్యటకులు ఎక్కువగా పెరుగుతారు అంటూ రివ్యూ ఇస్తున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ పెట్టడంతో సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడుతున్నారు. 

ఇక చివరిగా ఈ సినిమాలోని భక్తి పాటలాన్ని అద్భుతంగా ఉన్నాయని,అలాగే మంచు విష్ణుకి ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు రావడం ఖాయం అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ఫస్టాఫ్ కాస్త బాగా తీసి, లెంగ్త్ కొంచెం కట్ చేసి ఉంటే సినిమా మరింత అద్భుతంగా ఉండేదని మరో నెటిజన్ రివ్యూ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ లో చాలా వరకు బోరింగ్ మూమెంట్స్ ఉన్నాయని సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతం అంటూ రివ్యూలు ఇస్తున్నారు. ఓవరాల్ గా సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో కన్నప్ప సినిమాకి ట్విట్టర్ రివ్యూలు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: