మంచు విష్ణు,ప్రభాస్,మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లు ప్రధాన పాత్రలో వచ్చిన కన్నప్ప మూవీ తాజాగా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాని యూఎస్ ప్రీమియర్ షోలు చూసిన చాలా మంది ఎక్స్ ద్వారా స్పందిస్తూ సినిమాపై భారీ హెప్ ఇస్తున్నారు.అయితే ఈ సినిమా చూసిన చాలామంది జనాలు పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో సినిమా చూడడానికి మరింతమంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే కన్నప్ప సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎవరికీ తగ్గట్టు వాళ్ళు కథ రాసుకున్నారు. కాని క్లైమాక్స్ అన్ని సినిమాల్లో ఒకేలా ఉంటుంది. అయితే మంచు విష్ణు భారీ బడ్జెట్ పెట్టి న్యూజిలాండ్ లో భారీ భారీ సెట్స్ వేయించి మరీ కన్నప్ప సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో న్యూజిలాండ్ అందాలతో సినిమాకి మరింత పేరు వచ్చిందని అంటున్నారు. ఇక ఏ సినిమా విడుదలైనా సరే ఆ సినిమాలో కొన్ని ప్లస్ లు ఉంటే మరి కొన్ని మైనస్ లు ఉంటాయి. మరి తాజాగా విడుదలైన కన్నప్ప సినిమాలో ప్లస్ లు ఏంటి మైనస్ లు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 కన్నప్ప సినిమా ప్లస్సులు :
-కన్నప్ప సినిమాకి అతి పెద్ద ప్లస్ ఏంటంటే భారీ తారాగణం ఉండటమే.. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, విష్ణు, మోహన్ బాబులు ఉండడం సినిమాకి పెద్ద ప్లస్.
-శివ భక్తి అనే కాన్సెప్ట్ ని చూపించడం సినిమాకి ప్లస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో భక్తి భావంతో వచ్చే సినిమాలు బాగా హిట్స్ అవుతున్నాయి.
-అలాగే దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు.
-సినిమా క్లైమాక్స్ పూర్తి సినిమాకి మంచి గుర్తింపుని తెచ్చిందని అంటున్నారు.అయితే క్లైమాక్స్ అన్ని సినిమాల్లో ఒకేలా ఉన్నప్పటికీ విష్ణు కన్నప్ప సినిమాలో మాత్రం మరింత గూస్ బంప్స్ తెప్పించేలా చూపించారు.
-విష్ణు చివరి గంట యాక్టింగ్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది.
-రుద్ర పాత్రలో నటించిన ప్రభాస్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పుకోవచ్చు. -సినిమాకి మరో పెద్ద ప్లస్ బీజీఎం

 కన్నప్ప మూవీ మైనస్లు :
-సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి కన్నప్ప సినిమాపై ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. విమర్శలు ఈ సినిమాకి ఎక్కడో ఒక మూలన మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
-అయితే కన్నప్ప మూవీ విడుదలకు ముందే ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంది.ఈ వివాదాలు కూడా సినిమాకి కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు.
-అలాగే సినిమా ఫస్ట్ ఆఫ్ బాలేదని టాక్ వినిపిస్తోంది.
- అంతేకాకుండా లెంగ్త్ కాస్త తగ్గించి ఉంటే సినిమా మరింత బాగుండేదని అంటున్నారు. -వీఎఫ్ఎక్స్ కూడా చాలా పూర్ గా ఉందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.
-కొన్ని కొన్నిచోట్ల లొకేషన్స్ కూడా సినిమాకి మైనస్ గా నిలిచాయంటూ కొంత మంది నెటిజన్స్ ట్విట్టర్లో రివ్యూ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: