ఏ.కోదండరామిరెడ్డి... ఈయ‌న గురించి అప్ప‌టి తరానికి తెల్సినంతగా ఈ తరానికి పెద్దగా తెలీదు. 1980వ ద‌శ‌కంలో కోదండ రామిరెడ్డి సినిమాలు అంటే ఓ సెన్షేష‌న్‌. హీరో కావాలని చిత్రసీమలో అడుగెట్టి సూపర్ హిట్ దర్శకుడైన వైనం మనకు తెలియాల్సిందే. ఆయ‌న స్వ‌స్థ‌లం నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌. ఆయ‌న తీసిన తొంభైమూడు సినిమాల్లో అన్నీ దాదాపు హిట్లే.. హీరో అవ్వాలన్న కోరికను తన కొడుకు ( వైభవ్ రెడ్డి )ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేసినా ఎందుకో అదీ సఫలం కాలేదు..చిరంజీవితో చేసిన ఇరవైమూడు సినిమాలకి పంతొమ్మిది  సూపర్ హిట్లు. బాలయ్యతో కూడా పద్దెనిమిది హిట్లు.. ఆ కాలంలో క్రియేటివ్ కమర్షియల్స్ .. కోదండరామిరెడ్డి.. కే ఎస్ రామారావు..చిరంజీవి...యండమూరి.. లోక్ సింగ్ .. ఇళయరాజా ...చాలా గొప్ప కలయిక... పోస్టర్ కనబడితే చాలు... హాఫ్ టికెట్ సినిమా అయినా చూసి త‌రించే ప్రేక్ష‌కులు ఉండేవారు.


ఖైదీ - ఓ అభిలాష - ఓ రాక్షసుడు - ఓ మరణమృదంగం - ఓ ఒకరాధ ఇద్దరుకృష్ణులు - ఓ కిరాయి కోటిగాడు - రామరాజ్యంలో భీమరాజు - ఓ నారీ నారీ నడుమ మురారి - ఓ బొబ్బిలిసింహం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్లు. ఇక నాగార్జునకు క్లాస్ ఇమేజ్ తప్పించి మాస్ ఇమేజ్ తెచ్చిన ఘనత ఈయనదే . ఇలా రాసుకుంటూ పోతే వేళ్ళు నొప్పి పుడతాయి గానీ ఆయ‌న సినిమాల లిస్ట్ మాత్రం పూర్తి కాదు. ఎన్ని సినిమాలు తీసినా ఎన్టీఆర్ తో సినిమా తీయలేదనే బాధ తో ఇప్పటికీ కలత చెందుతాడీ కోదండరాముడు. అయితే సింహ‌బ‌లుడు సినిమాకు కె. రాఘ‌వేంద్ర రావు ద‌గ్గ‌ర అసిస్టెంటు గా ప‌ని చేస్తోన్న‌ప్పుడు సెకండ్ యూనిట్ డైరెక్ట‌ర్‌గా ఎన్టీఆర్‌పై కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించిన అనుభూతి త‌న‌కు మిగులుతుంద‌ని ఆయ‌న చెప్పేవారు. ఇప్పుడున్న సోషల్ మీడియా ఎప్పుడూ ఇతన్ని పట్టించుకోలేదు. ఈ రోజు ఏ.కోదండరామిరెడ్డి పుట్టినరోజు సంద‌ర్భంగా ఇండియా హెరాల్డ్‌.కామ్ త‌ర‌పున ఆయ‌న‌కు హృద‌య పూర్వ‌క పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: