ఏంటి వర్షం మూవీలో గోపీచంద్ భార్య ఉంటుందా..పిచ్చిదానిలా చూపించారా.. ఇంతకీ ఆమె ఎవరు అనేది చూస్తే వర్షం మూవీలో గోపీచంద్ భార్య అంటే రియల్ వైఫ్ రేఖ అనుకుంటారు. కానీ గోపీచంద్ భార్య ఇప్పటివరకు సినిమాల్లో నటించిందే లేదు.వర్షం సినిమా టైంకి గోపీచంద్ కి పెళ్లి కాలేదు.మరి కొత్తగా ఈ భార్య ఎక్కడినుండి వచ్చింది అనుకుంటారు. అయితే రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో వర్షం మూవీలో గోపీచంద్ భార్య.. మరి వర్షం సినిమాలో అసలు గోపీచంద్ కు భార్యనే ఉండదు కదా అని ఇంకొంతమంది అనుమానపడతారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. వర్షం సినిమా ఫస్ట్ అనుకున్న స్టోరీ ఇది కాదట. మొదట వేరే స్టోరీ అనుకొని సీన్స్ చిత్రీకరించారట. కానీ సడన్గా సినిమా మొత్తం మార్చేసి వేరే విధంగా షూట్ చేశారట. ఇక అసలు స్టోరీ ఏంటంటే.. వర్షం మూవీ లో విలన్ పాత్రలో నటించిన గోపీచంద్ కి భార్య ఉంటుంది. 

మొదట పెళ్లి అవుతుంది. కానీ త్రిషని చూసాక మొదటి భార్యతో విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు.కానీ దానికి ఆమె ఒప్పుకోదు. దాంతో ఆమెను దారుణంగా హింసించి చేయి విరగ్గొట్టి బలవంతంగా డివోర్స్ పేపర్ల మీద సైన్ చేయించుకుంటాడు. ఆ తర్వాత గోపీచంద్ భార్య పిచ్చిది అయిపోయి రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. అలాగే చివరికి  పిచ్చిదాని పాత్రలో ఉన్న గోపీచంద్ మొదటి భార్య ప్రభాస్ కి అసలు స్టోరీ చెప్పుతుంది. అయితే ఈ స్టోరీ మొత్తం మొదట తెరకెక్కించాక ఆ తర్వాత మార్చేశారట. అసలు గోపీచంద్ భార్య అనే సీన్ ఇందులో చూపించకూడదు అని ఫిక్స్ అయి కథ మొత్తం మార్చారట. ఇక గోపీచంద్ భార్య పాత్రలో నటించింది ఎవరో కాదు ఈ సినిమాలో పిచ్చిదాని పాత్రలో కనిపించే సీరియల్ నటి అస్మిత.. మొదట ఈ మూవీలో గోపీచంద్ కి భార్యగా అస్మితను  తీసుకున్నారట.

సీన్స్ అన్ని చిత్రీకరించాక గోపీచంద్ భార్య క్యారెక్టర్ ని తీసేయాలని నిర్ణయించుకొని అస్మితని షూటింగ్ కి పిలవలేదట.ఆ తర్వాత ఫోన్ ఎందుకు చేయడం లేదని తిరిగి చిత్ర యూనిట్ కి కాల్ చేయగా మీ పాత్రను ఇందులో తీసేస్తున్నామండీ స్టోరీ మొత్తం మార్చేసాం అని చెప్పారట.దాంతో అస్మిత అలా అయితే నా మీద షూట్ చేసిన ఫోటోలు,వీడియోలు సీన్స్ అన్ని డిలీట్ చేయండి సినిమాలో అని చెప్పిందట.అయితే అస్మితకి సంబంధించిన అన్ని సీన్స్ డిలీట్ చేసినప్పటికీ పిచ్చిదాని పాత్రలో ఉన్న సినిమా మాత్రం డిలీట్ చేయలేకపోయారు. దాంతో అసలు వర్షం సినిమాలో అస్మిత పిచ్చిదాని క్యారెక్టర్ లో ఎందుకు చూపించారని చాలామంది షాక్ అయిపోయారు. అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీని గురించి స్వయంగా క్లారిటీ ఇచ్చింది అస్మిత. దాంతో అసలు విషయం బయటపడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: