
నితిన్ సంగతి చూస్తే అప్పుడెప్పుడో 'గుండెజారి గల్లంతయ్యిందే' హిట్ అయ్యింది. తర్వాత 'భీష్మ' తప్ప ఏ పెద్ద విజయం లేదు. మిగతా సినిమాలన్నీ డిజాస్టర్లు. తాజాగా వచ్చిన 'తమ్ముడు' అయితే నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ 'ఎల్లమ్మ' సినిమాపైనే పెట్టారు. గోపీచంద్ కూడా 2014లో వచ్చిన లౌక్యం ఆయన లాస్ట్ హిట్ . అలా అప్పటినుంచి వరుస ప్లాపులతో సాగుతున్న ఆయనకు గత 10 ఏళ్లలో ఒక్క హిట్ కూడా లేదు. అయినా ఆయన భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ విజయాలూ మాత్రం దక్కడం లేదు . రామ్ పోతినేని పరిస్థితి కూడా సేమ్ .. 2011లో 'కందిరీగ' తర్వాత 'నేను శైలజ', 'ఇస్మార్ట్ శంకర్' తప్ప మిగతా సినిమాలన్నీ ఫెయిల్యూర్స్. ఇస్మార్ట్ శంకర్ ఫాలోప్‌గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ అంచనాలు అందుకోలేదు. ప్రస్తుతం 'ఆంధ్ర కింగ్' సినిమాతో కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్ ఈ మెగా హీరో 2018 వచ్చిన తొలిప్రేమ మధ్యలో గద్దలకండ గణేష్ సినిమాలతో హిట్ అనే పదానికి కొన్ని వేల కిలోమీటర్లు దూరంలోకి వచ్చేసాడు వరుణ్ . తన క్యారెక్టర్ కు తగ్గ లవ్ సినిమాలు వదిలేసి యాక్షన్ మాస్ సినిమాలు చేసి తన మార్కెట్ ను పాతంలోకి పడేసుకున్నాడు . శర్వానంద్ ఈ హీరో కూడా మహానుభావుడు' తర్వాత శర్వానంద్‌కు హిట్ దొరకలేదు. కొన్ని సినిమాలైతే ఓపెనింగ్స్ కూడా రాలేకపోయాయి. అయినా ఆయనకు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ దక్కుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ మొత్తంలో 'రాక్షసుడు' ఒక్కటే మేటైన హిట్. మిగిలిన సినిమాలు ఫెయిల్యూర్స్. అయినా కోట్లలో బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తూనే ఉన్నారు.
అల్లరి నరేష్ కొన్ని సినిమాలు చేసిన ప్రేక్షకుల నుంచి సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు మధ్యలో నాంది సినిమాతో ట్రాక్ మార్చి హిట్ అందుకున్నాడు .. తర్వాతి సినిమాలు ఆ స్థాయిలో లేకపోయాయి. వరుసగా సినిమాలు చేయలేదు కానీ హిట్స్ మాత్రం అరుదే. విశ్వక్సేన్ .. హిట్ తర్వాత విజయం లేని విశ్వక్ సినిమాలు అయితే చేస్తూ వస్తున్నాడు కానీ విజయం మాత్రం రావట్లేదు .. లైలా సినిమాతో టాలీవుడ్ లోనే వరస్ట్ సినిమా అనే పేరు కూడా తెచ్చుకున్నాడు .. ఇలా వీరు మాత్రమే కాదు కార్తికేయ, రాజ్ తరుణ్, కిరణ్ అభవరం, వైష్ణవ తేజ్, ఆనంద్ దేవరకొండ, సందీప్ కిషన్ ఇలా చాలా మిండ్ రేంజ్ హీరోలు సినిమాలు చేస్తున్నారు కానీ విజయాలు మాత్రం అందట్లేదు .. వీరిలో కొందరు సినిమాలైతే ఓటీటీ డీల్స్ కూడా అందుకోవటం లేదు .. అయినా కూడా నిర్మాతలు కోట్లకు కోట్లు పారితోషికాలు ఇస్తూ వీరితో సినిమాలు చేస్తున్నారు ..