బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ కి ఆమె పర్సనల్ అసిస్టెంట్ భారీ టోకరా వేసింది. గుడ్డిగా నమ్మినందుకు ఏకంగా రూ. 77 లక్షలు కాజేసి మోసం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేదిక ప్రకాశ్‌ శెట్టి (32) ఆలియా భ‌ట్ ద‌గ్గ‌ర 2021 నుంచి 2024 వ‌రకు ప‌ర్స‌న‌ల్ అస్టిస్టెంట్ గా వ‌ర్క్ చేసింది. ఆలియా వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలతో పాటు ఆమె నిర్మాణ సంస్థ `ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్` ఆర్థిక వ్యవహారాల‌ను వేద‌కనే చూసుకునేది. ఎంతో న‌మ్మ‌కంగా ప‌ని చేస్తుండ‌టంతో ఆలియా భ‌ట్ కూడా ఆమెను ఎంత‌గానో న‌మ్మింది.


మొద‌టి ఏడాదిన్న‌ర బాగానే ప‌ని చేసిన వేదిక శెట్టి.. ఆ త‌ర్వాత త‌న అస‌లు బుద్ధి బ‌య‌ట‌పెట్ట‌డం స్టార్ట్ చేసింది. 2022 మే నుంచి మీటింగ్స్‌, ట్రావెల్‌, ఇతర ఖర్చుల పేరుతో న‌కిలీ బిల్లులు సృష్టించి.. వాటిపై ఆలియా సంతకాలు తీసుకోవ‌డం మొద‌లు పెట్టింది. అలా రెండున్న‌ర ఏళ్ల‌లో నకిలీ బిల్లుల ద్వారా ఆలియా వ్య‌క్తిగ‌త ఖాతా మ‌రియు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏకంగా రూ.77 లక్షలు కాజేసింది. ఈ ఆర్థిక అవకతవకలను గుర్తించిన ఆలియా తల్లి, నటి మ‌రియు దర్శకురాలు సోనీ రజ్దాన్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జూహూ పోలీసు స్టేష‌న్ లో వేదిక శెట్టిపై ఆమె ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. చీటింగ్, నమ్మకద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా.. వేదిక‌గా ప‌రారైంది. రాజస్థాన్, కర్ణాటక, పూణే వంటి ప్రాంతాల్లో త‌ల దాచుకుంటూ పోలీసుల‌కు చిక్క‌కుండా తిరిగింది. ఇక కేసు న‌మోదు ఐదు నెల‌ల‌కు పోలీసులు వేదిక శెట్టిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. జూలై 8న ఆమెను కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా.. న్యాయ‌స్థానం వేదికకు రెండు రోజుల పాటు పోలీసుల క‌స్ట‌డీ విధించింది. ప్ర‌స్తుతం పోలీసులు వేదికను అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: