అల్లు ఫ్యామిలీ.. ఈ పేరు ఒకప్పుడు లోకల్ లో మాత్రమే వినిపించేది . ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా అల్లు అర్జున్ ఆ రేంజ్ ని నేషనల్ వైడ్ తీసుకెళ్లగలిగారు. అడపాదడపా బిగ్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూ ఆ సినిమాలను హిట్ చేసుకుంటూ నేషనల్ మీడియాలో కూడా అల్లు ఫ్యామిలీ పేరుని హైలెట్ అయ్యేలా మార్చుకున్నాడు . అయితే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ పేరు లోకల్ - నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం బన్నీ అని చెప్పుకోక తప్పదు . రీసెంట్ గానే నాట్స్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు . అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఆయన బిహేవ్ చేసిన పద్ధతి ఆయన సంస్కారం.. మరింత హైలెట్ అయ్యేలా బన్ని పేరును చేశాయి .


దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్లు అర్జున్ పేరు మారుమ్రోగిపోతుంది. బన్నీ లాంటి హీరోనే ఇండస్ట్రీలో ఉండాలి అంటూ బన్నీ డౌన్ టు ఎర్త్ అంటూ బన్నీకి మంచి లైఫ్ ఉండాలి అంటూ కోరుకుంటున్నారు అభిమానులు. నాట్స్ కార్యక్రమానికి వచ్చిన తన అభిమానులను స్పెషల్గా పలకరించడమే కాదు తనదైన స్టైల్ లో డైలాగులు చెబుతూ ఆకట్టుకున్నాడు.  సాధారణంగా ఏ పెద్ద హీరో తన సినిమా డైలాగ్స్ స్టేజ్ పై చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపరు . పైగా సినిమా ప్రమోషన్స్ కోసం అలా చేస్తారేమో కానీ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాక మాత్రం అస్సలు పట్టించుకోరు .



కానీ బన్నీ మాత్రం పుష్ప2 సినిమాకు సంబంధించిన డైలాగ్స్ చాలా అవలీల చాలా బాగా చక్కగా చెప్పారు . దీంతో అభిమానులు ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు . ఇప్పుడు అల్లు ఫ్యామిలీ పేరు ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుంది. దానికి దీ వన్ అండ్ ఓన్లీ రీజన్ బన్నీ అంటున్నారు అభిమానులు.  అంతేకాదు పుష్ప సినిమాలోని డైలాగ్ ను రీ క్రియేట్ చేస్తున్నారు. " అల్లు ఫ్యామిలి అంటే నేషనల్ అనుకుంటివ  కాదు ఇంటర్నేషనల్ " అంటూ బన్నీని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. కాగా  అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో మృణాల్ అదేవిధంగా దీపికా పదుకొనే హీరోయిన్లుగా సెలెక్ట్ అయ్యారు . అంతేకాదు ఆస్కార్ అవార్డు విన్నర్ విల్ స్మిత్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ లో కన్నిపించబోతున్నాడట . ఈ సినిమాలో మరో బిగ్ బడా హీరో కూడా భాగం కాబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: