మోహన్ బాబు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వరు. ముఖ్యంగా ఆయన్ని చూస్తేనే చాలామంది భయపడతారు.ఆయనతో మాట్లాడాలంటే భయం భయంగానే మాట్లాడుతుంటారు. అయితే మోహన్ బాబు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ లోపల మనసు వెన్న అంటారు ఆయనతో సన్నిహితంగా మెదిలిన చాలామంది ఆర్టిస్టులు. అయితే తాజాగా మోహన్ బాబు ఆలీతో సరదాగా షో కి వచ్చారు.అయితే ఈ షో స్టార్ట్ అయ్యి 250 ఎపిసోడ్లు పూర్తవడంతో 250 ఎపిసోడ్ కి ఒక ప్రముఖమైన వ్యక్తిని పిలవాలని మోహన్ బాబుని గెస్ట్ గా పిలిచారు.అలా మోహన్ బాబు వచ్చాక కమెడియన్ అలీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా ఆ హీరోకి రెండో పెళ్లికి సంబంధించి ప్రశ్న అడగగా మోహన్ బాబు ఆలీపై ఫైర్ అయ్యారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది చూస్తే సీనియర్ ఎన్టీఆర్..

 నీకు అసలు విషయం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ మోహన్ బాబు నటించిన మేజర్ చంద్రకాంత్ 100 రోజుల ఫంక్షన్ రోజు ఎన్టీఆర్ తన రెండో పెళ్లికి సంబంధించి అధికారిక న్యూస్ చెప్పి లక్ష్మీపార్వతిని స్టేజి మీద పిలిచి అందరికీ పరిచయం చేశారు. అయితే ఈ విషయం గురించి ఆలీ అడుగుతూ అన్న గారు రెండో పెళ్లి గురించి మీరు ఏమంటారు అని అంటే అన్నయ్య రెండో పెళ్లి చేసుకోవడం పూర్తిగా ఆయన వ్యక్తిగతం.. ఆయన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకునే హక్కు మనకు లేదు. ఆయనకు ఏం ఇష్టమో అదే చేశారు అంటూ కాస్త అసహనంగానే ఆన్సర్ ఇచ్చారు. అయితే ఆలీ మళ్ళీ ఇదే విషయం గురించి మాట్లాడుతూ అన్నగారు రెండో పెళ్లి చేసుకోవడంలో మీ హస్తం ఉంది అంటున్నారు నిజమేనా అని అడగగా.. ఆలీతో సరదాగా అంటే ఏదో సరదాగా ఉంటుంది అనుకున్నాను.

 కానీ ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని తెలియదు అంటూ కాస్త ఫన్నీగా అన్సర్ ఇచ్చారు. అలాగే అన్నగారు రెండో పెళ్లి విషయంలో హస్తం ఉంది అంటే అన్నయ్య తన అభిప్రాయాన్ని నాకు చెప్పారు.ఇక అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అన్నయ్యకు ఏమి ఇష్టమో నేను అదే చేశాను. అన్నయ్య అభిప్రాయాన్ని గౌరవించాను. ఆయన రెండో పెళ్లి పూర్తిగా ఆయన వ్యక్తిగతం దాని గురించి నేను మాట్లాడను.ఇక నా హస్తం ఉంది నా ప్రమేయం ఉంది అంటే దారిన పోయే కుక్కలు ఎంతో మొరుగుతాయి.కానీ మొరిగే ప్రతి కుక్కను పట్టించుకుంటూ పోతే మన గమ్యాన్ని చేరుకోలేం అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు మోహన్ బాబు. ప్రస్తుతం మోహన్ బాబు సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: