
ఒక్కో చిత్రానికి ఈ స్టార్ బ్యూటీ రూ. 10 కోట్ల రేంజ్ లో పారితోషికం పుచ్చుకుంటోంది. మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో సైతం నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. యాడ్స్ కోసం నయనతార చేస్తున్న డిమాండ్ కు స్టార్ హీరోలు కూడా షాక్ అయిపోతున్నారు. టాటా స్కైను నయనతార ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల టాటా స్కై యాడ్ షూట్ లో ఆమె పాల్గొంది. రెండు రోజుల పాటు షూటింగ్ జరిగింది.
50 సెకండ్ల నిడివి గల టాటా స్కై వానిజ్య ప్రకటనలో యాక్ట్ చేసినందుకు గానూ నయనతార తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. అక్షరాల రూ. 5 కోట్లు. అంటే ఒక్క సెకండ్ కోసం రూ. 10 లక్షలు ఛార్జ్ చేసిందన్నమాట. ఈ విషయం తెలిసి సామాన్యులే కాదు ఆమె తోటి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా నయనతార క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ దెబ్బతో మరోసారి స్పష్టమైంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు