
జూలై 13న తెల్లవారుజామున ఫిలింనగర్ లోని తన నివాసంలో శ్వాస విడిచారు కోట శ్రీనివాసరావు. ఆయనకి 83 ఏళ్లు . దాదాపు నాలుగు దశాబ్దాలుగా 750 పైగా చిత్రాలలో ఎన్నో పాత్రలు పోషించి తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్నాడు కోటా శ్రీనివాసరావు . కోట శ్రీనివాసరావుకు సాధారణంగా కోపం రాదు వస్తే మాత్రం ఎవరూ ఆపలేరు . కానీ ఓ సందర్భంలో మాత్రం కోట శ్రీనివాసరావు చాలా హుందాగా ప్రవర్తించాడు. కోటా చనిపోయాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి .
ఆ సమయంలో ఆయన స్పందిస్తూ .."వాడెవడో కోటా శ్రీనివాసరావు చచ్చిపోయాడని బతికుండగానే నన్ను చంపేశాడు . నాకు ఆరోగ్యం బాగోలేదు .అది అందరికీ తెలుసు . అందులో తప్పేముంది వయసు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కొన్ని సమస్యలు వస్తాయి. అయితే చచ్చిపోయారు అని వార్తలు రాసేస్తారా..? వాడిని పిలిచి గట్టిగా అరిచా.. తప్పు కదా అలా రాయడం.. మీ నాన్నకి 80 ఏళ్ళు వస్తే కాళ్ళు నొప్పులు రావా..? కీళ్ల నొప్పులు రావా..? అంత మాత్రన చచ్చిపోయాడు అని రాసేస్తావా..? నేను చచ్చిపోయాను అని వార్తలు రాసి రూపాయి సంపాదిస్తావా ..? అది తప్పు కదా..? ఇప్పటికే ఇలా ఎంతో మంది చనిపోయారు అంటూ వార్తలు రాశారు . అది చాలా చాలా తప్పు పాపం . అలా చేయనే చేయొద్దు. గతంలో సుశీల , జానకి కూడా ఇలానే చచ్చిపోయారు అంటూ వార్తలు రాశారు. సుశీల గారు ఎక్కడో అమెరికాలో బాగా చక్కగా ఉన్నారు . నేను బాగానే ఉన్నాను నీ మీద ఇలా తప్పుడు వార్తలు రాయొద్దు అని చెప్పారు . నాకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. మనిషి బ్రతికుండగానే చంపేయడం ఏంటయ్యా దారుణం కదా ..?? అంటూ తన మరణ వార్తలను తానే ఖండించుకున్నాడు కోటా శ్రీనివాసరావు". అలాంటి నిజాయితీగల యాక్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో లేకపోవడం ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోలేని బాధ..!