
కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అంటూ వెల్లడించారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ మా అందరికీ ప్రియమైన వ్యక్తి కోటా శ్రీనివాసరావు.. సినీ పరిశ్రమ ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది.. ప్రతిఘటన సినిమాలో కోట శ్రీనివాసరావు నటించిన వల్లే ఓవర్ నైట్ కి స్టార్ గా పేరు సంపాదించారు. కోట నేను కలిసి ఎన్నో చిత్రాలలో నటించాము. ఆయన ఎక్కువగా విలన్ పాత్రలోనే కనిపించేవారు. అలాగే కామెడీతో కూడా ఎన్నో చిత్రాలలో ప్రేక్షకులను బాగా అలరించారని. కోటా శ్రీనివాసరావు మృతితో ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను అంటూ వీరు మురళీమోహన్ ఎమోషనల్ గా మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
మొదటిసారి చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమా ద్వారా కోట శ్రీనివాసరావు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. కోట శ్రీనివాసరావు చెప్పిన డైలాగులు విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తెలుగులోని భాష యాసల పై కోట శ్రీనివాసరావుకు మంచి పట్టు ఉంది. ఆయన ఒక పిసినారిగా, ఒక క్రూరమైన విలన్ గా ,మధ్యతరగతి తండ్రిగా ఎన్నో అద్భుతమైన పాత్రలు ఒదిగిపోయి నటించారు. కోట శ్రీనివాసరావు నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా పేరు సంపాదించారు కొన్ని చిత్రాలలో ప్రత్యేకించి మరి పాటలు కూడా పాడిన సందర్భాలు ఉన్నాయట. మరి అలాంటి నటుడు ఇండస్ట్రీ కోల్పోవడం బాధాకరమని చెప్పవచ్చు.