టాలీవుడ్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు జేబులకు చిల్లు పడిపోతుంది. పెద్ద హీరోల క్రేజ్ ఆసరాగా చేసుకుని అభిమానుల నుంచి అందిన కాడికి లాగేస్తున్నారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో రేట్లు టాలీవుడ్ లోనే అత్యధికంగా నిలిచాయి. ఇక మిగిలిన సినిమాలు కూడా మినిమం టికెట్ రేటు 500 ఉంటుంది .ఎప్పటికప్పుడు ప్రత్యేక అనుమ‌తులు తెచ్చుకున్న టిక్కెట్లు పెంచుకుంటున్నారు. పక్క రాష్ట్రం కర్ణాటక బెంగళూరులో వీకెండ్ రేట్లు అయితే చుక్కల్లో ఉంటాయి. దీంతో కన్నడ సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కర్ణాటకలో ప్రదర్శించబోయే ఏ సినిమాకు అయినా వినోదపు పన్ను తో కలిపి టికెట్ రేటు 200 రూపాయల దాటకూడదని ఆర్డర్ పాస్ చేసింది.


సింగల్ స్క్రీన్ - మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా అన్ని థియేటర్ల‌కు .. అన్ని సినిమాల కు ఈ రూల్‌ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ ఒక్క దెబ్బతో కర్ణాటకలో వీకెండ్ 1500 రూపాయలు ఉండే టిక్కెట్ రేటు ఇప్పుడు 200 రూపాయలకు వచ్చేసింది. పనిలోపనగా పాప్కాన్ టికెట్లు కూడా తగ్గించాలని డిమాండ్లు ఊపు అందుకున్నాయి. అయితే ఇది సినిమాలపై గట్టి ప్రభావం చూపిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో ఇప్పుడిప్పుడే భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇలాంటి టైంలో టిక్కెట్లు అమాంతం తగ్గిస్తే ఇండస్ట్రీ కుదేలు అతుందని అంటున్నారు. మన వైపు మల్టీప్లెక్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న కన్న‌డ‌ సినిమాల కోసం ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు రావాలన్న ఉద్దేశంతో కర్ణాటక ఫిలిం ఛాంబ‌ర్ - కర్ణాటక ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: