మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రం పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ఠకు ఇది రెండవ సినిమా కాగా, గతంలో బింబిసార వంటి హిట్ చిత్రాన్ని అందించాడు. బింబిసార విజయంతో వశిష్ఠ మీద ఉన్న నమ్మకంతో చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, మరికొంతమంది స్టార్ హీరోయిన్‌లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే కీలక దశకు చేరుకుంది. అందులో భాగంగా ఇప్పుడు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


ఈ స్పెషల్ సాంగ్‌కు భీమ్స్ సిసిరోహ్ సంగీతం అందించనున్నారని టాక్. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే - సినిమా మొత్తంకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కేవలం ఈ సాంగ్‌కి మాత్రమే భీమ్స్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ తరహా ఒప్పందం చాలా అరుదైనది . అయితే అసలైన హైలైట్ – ఈ స్పెషల్ సాంగ్‌లో మెగాస్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ కనిపించనున్నారని సమాచారం. ‘నాగిన్’ సీరియల్ ద్వారా బోల్డ్ మరియు గ్రేస్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ తో గుర్తింపు తెచ్చుకున్న మౌని, ఈ పాటలో చిరుతో కలిసి అదరగొట్టనుంది . అంతేకాదు, ఈ పాట ఒకప్పుడు ‘ఖైదీ’ సినిమాలో చిరంజీవి & మాధవి లపై చిత్రీకరించబడిన ‘రగులుతోంది మొగలిపొద’ సాంగ్‌కు రీమేక్ అని తెలుస్తోంది.


ఒకప్పుడు థియేటర్లను కుదిపేసిన ఈ పాటను మోడర్న్ టచ్‌తో, గ్రాండుగా తీర్చిదిద్దబోతున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే – "మొగలిపొద మళ్లీ రగులుతుంది.. ఆ కూడా విశ్వంభర సౌండ్‌తో !  ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఒకవైపు చిరు క్లాసిక్ స్టెప్స్, మరోవైపు మౌని గ్లామర్ పర్ఫార్మెన్స్ – ఈ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ మెగామేనియాను తిరిగి తీసుకొచ్చేలా ఉంది. విశ్వంభర థియేటర్లలోకి వచ్చే ముందు నుంచే ఈ స్పెషల్ సాంగ్‌కి ఎదురుచూపులు మొదలయ్యాయి. మిగిలిన వివరాలు అధికారికంగా బయటకు రావాల్సి ఉంది కానీ, ఈ లీకులు అభిమానులను ఇప్పటికే ఉర్రూతలూగిస్తున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: